ఒలింపిక్ స్టార్లను ఘనంగా సత్కరించిన దిల్లీ ప్రభుత్వం
- August 31, 2016
రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దిన కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులను దిల్లీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. దిల్లీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రజత పతక విజేత పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్, వారి కోచ్‌లు గోపీచంద్, మన్‌దీప్‌లను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు. ఒలింపిక్ విజేతలకు అనుక్షణం తోడుగా ఉండి పూర్తిస్థాయి ఫిట్నెస్ను కాపాడుకోవడంతో తోడ్పడిన ఫిజియోథెరపిస్టులను సైతం ఈ కార్యక్రమంలో సత్కరించారు. గతంలో ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతులను ఈ సందర్భంగా సింధు, సాక్షి మలిక్‌లకు కేజ్రీవాల్ అందజేశారు.
అనంతరం సింధు, మలిక్ మాట్లాడుతూ.. దిల్లీ ప్రభుత్వం ప్రోత్సాహం, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







