బెండకాయ తినడం వల్ల వచ్చే ఉపయోగాలు
- August 31, 2016
బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా బెండకాయ విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఫోలేట్ లోపం వల్ల రొమ్ము, మెడ, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా గర్భణీగా ఉన్నప్పుడు ఇవి మరీ అవసరం. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. అనేక వ్యాధుల నివారణకు పండ్లూ, కూరగాయల్లోని పీచు ఎంతో అవసరం. బెండలో పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఈ కాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటుంది.
బెండకాయ గింజల్లోని పదార్ధాలు అద్భుత యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కె ఎక్కువగా ఉండే బెండకాయలు ఎముకలకూ ఎంతో మంచిది. కాల్షియంను శోషించుకునేందుకు వీటిల్లోని ఇ విటమిన్ దోహదపడుతుంది. అయితే మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళ నొప్పులూ ఉన్నవాళ్ళు వీటిల్లోని ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలమిన్ల కారణంగా తగు మోతాదులో తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







