జనతా గ్యారేజ్:రివ్యూ
- August 31, 2016
టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలతో ఫామ్‌లోకి వచ్చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ హీరో నటించిన జనతాగ్యారేజ్ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఇదిలావుండగా మలయాళం నటుడు మోహన్‌లాల్ కూడా కీలక రోల్ చేస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేవలం రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్ స్టేటస్ అందుకున్నాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ కొట్టడంతో జనతాగ్యారేజ్‌పై ఆశలు రెట్టిపయ్యాయి. మరి గత సినిమాల మాదిరిగానే గ్యారేజ్ కూడా బాక్సాఫీసుని ఆకట్టుకుందా? లేదా అన్నది రివ్యూలో..
స్టోరీ..
ఐఐటీ గ్రాడ్యుయెట్ ఆనంద్ (ఎన్టీఆర్) ప్రకృతిని ప్రేమించే మనస్తత్వం గలవాడు.
చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలంటాడు. సత్యం (మోహన్‌లాల్) ఓ మెకానిక్... ఆయన తమ్ముడు (రెహమాన్)తో కలిసి ఓ గ్యారేజ్ నిర్వహిస్తాడు. పేరుకే గ్యారేజ్‌గానీ ఎవరైనా వచ్చిన తమ సమస్యల్ని ప్రస్తావించినప్పుడు పరిష్కారం చూపిస్తాడు సత్యం... ఆ క్రమంలో ఆయనకు శత్రువులు కూడా పెరుగుతారు. ఇదేక్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. ఆయన కొడుకే ఆనంద్ (ఎన్టీఆర్). చిన్నప్పుడే గ్యారేజ్‌కి దూరంగా అంటే మేనమామ (సురేష్)కి ఇచ్చి ముంబై పంపిస్తాడు. ఆనంద్‌కి ఓ ఫ్యామిలీ వుందని విషయం తెలీకుండా పెంచుతాడు మేనమామ. చిన్నప్పట్నుంచీ చెట్లపై ప్రేమ పెంచుకుంటూ వాటినే తన ప్రపంచంగా మార్చేసుకొని బతుకుతాడు ఆనంద్. అనుకోని పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండే గ్యారేజ్‌ని లీడ్ చేయాల్సివస్తుంది. ఇంతకీ ఆనంద్ గ్యారేజ్‌కి రావటానికి కారణాలేంటి? అసలు గ్యారేజ్‌లో ఏం జరుగుతుంది? లోలోపల సమస్యలకు ఆనంద్ ఎలా ఫుల్‌స్టాప్ పెట్టాడన్నదే అసలు స్టోరీ!
విశ్లేషణ..
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రెండు బలమైన రోల్స్. ఇక చుట్టూ అనుబంధాలే కీలకం. స్టోరీ విషయంలో డైరెక్టర్ కసరత్తు చేయలేదన్న ఆలోచన సగటు ప్రేక్షకుడికి వస్తుంది. చెడుపై మంచి గెలవడం అన్ని సినిమాల్లోనూ కనిపించేదే.. జనతా గ్యారేజ్ కూడా ఈ కోవలోనిదే! యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనను మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, డ్యాన్స్ ఇలా ఎందులో చూసినా మంచి పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్టాఫ్ మోహన్‌లాల్ రోల్ కీలకం కాగా, జనతా గ్యారేజ్‌లోకి ఆనంద్ రావడంతో అసలు స్టోరీ మొదలౌతుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్‌లాల్ నటన మూవీని నిలబెట్టింది. ఇక సెకండాఫ్‌కి వస్తే.. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో మొదటి అర్ధగంట మేజర్ హైలైట్. ఈ టైమ్‌లో వచ్చే మాంటేజ్ సాంగ్ బెటర్.
ఇక మైనస్ విషయానికొస్తే.. బలహీనమైన స్టోరీ, సరైన విలన్ లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది. సెకండాఫ్‌లో స్టోరీ లేకపోవడం. సమంత, నిత్యామీనన్ వంటి హీరోయిన్లున్నా వాళ్లని వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. దీనికితోడు కామెడీ కూడా పెద్దగాలేదు. దర్శకుడు కొరటాల తనలోని రచయితని బయటపెట్టాడు. రాజీవ్ కనకాలకు సంబంధించిన సమస్యలుంటే ఇంకొన్ని వుంటే బాగుండేది. ఇక డ్యాన్స్ విషయాన్నికొస్తే.. కాజల్ చేసిన 'పక్కాలోకల్' ఐటమ్‌సాంగ్ బిగ్ రిలీఫ్! విలన్‌గా ఉన్నిముకుందన్ క్యారెక్టర్‌పై ఇంకా ఫోకస్ పెట్టి వుంటే బాగుండేది. బలమైన టెక్నికల్ టీమ్ వుంది.. దేవిశ్రీ మ్యూజిక్, తిరు కెమెరా వర్క్ అభిమానుల్ని ఆకట్టుకొటుంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. గ్యారేజ్‌లో వాహనాలు రిపేర్ ఓకే.. కాకపోతే సొసైటీ రిపేరే ఎబ్బెట్టుగా వుంది. ప్రస్తుతం ఈ సీజన్‌లో ఇతర బిగ్ స్టార్స్ సినిమాలేవీ లేకపోవడంతో ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది.
--మాగల్ఫ్ రేటింగ్:3.25
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









