'కాటమరాయుడు'గా రాబోతున్న పవన్ కళ్యాణ్
- September 01, 2016
పవన్‌కల్యాణ్ చిత్రమంటే కేవలం అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకు ఆయన సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం ఉత్సుకతను కలిగిస్తుంది. ఇక అభిమానుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. జల్సా, పులి, పంజా, గబ్బర్‌సింగ్, సర్దార్ గబ్బర్‌సింగ్ ఇలా ఆయన సినిమా టైటిళ్లు కూడా మాస్‌ను మెప్పించేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా 'కాటమరాయుడు'గా పవన్‌కల్యాణ్ రాబోతున్నారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌కు సంబంధించి నిర్మాత శరత్‌మరార్ ఓ ప్రకటన చేశారు. 'కాటమరాయుడు' పేరుతో పవన్ సినిమాను నిర్మించనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. 'గోపాల గోపాల' దర్శకుడు కిశోర్‌కుమార్ పార్దసాని(డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు.అన్నట్లు 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌కల్యాణ్ 'కాటమరాయుడా కదిరి నరసింహుడా..' అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







