డౌన్టౌన్ దుబాయ్లో ఇజెడ్ 10 హల్చల్
- September 02, 2016
జిసిసి రీజియన్లో తొలి డ్రైవర్ లెస్ కారు దుబాయ్ డౌన్టౌన్లో హల్చల్ చేస్తోంది. 10 మంది కూర్చునేందుకు వీలున్న ఈ కారు గురువారం నుంచి మొహమ్మద్ బిన్ రషీద్ బలైవార్డ్లో సట్లింగ్ చేస్తోంది. ఇజెడ్10 తొలి రైడర్ గ్లాడిస్ రెగో మాట్లాడుతూ, అద్భుతమైన ప్రయాణానుభూతిని పొందినట్లు చెప్పారు. తక్కువ దూరం గల ప్రయాణాలకు ముందుగా ప్రోగ్రామ్ చేసుకుని, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రయాణించవచ్చని తయారీదారులు వెల్లడించారు. ప్రయాణీకులు అత్యద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు. 15 కెవి బ్యాటరీతో ఇజెడ్10 వాహనం నడుస్తుంది. నాలుగు నిమిషాల ప్రీ ప్రోగ్రామ్డ్ ప్రయాణంలో మొత్తం 700 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఏడేళ్ళ రోక్సానె డి కోస్టా చెప్పారు. విదా హోటల్ నుంచి దుబాయ్ ఒపెరా వరకు ఈ ప్రయాణం సాగింది. ఇజె10 అత్యధికంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రయోగ దశలో కేవలం గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







