తెలంగాణలో జాగృతి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభం
- September 02, 2016
తెలంగాణలో జాగృతి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కేంద్ర మంత్రి రాజీవ్ప్రతాప్రూడీ ఈ శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మానవ వనరుల కోసం ప్రపంచం భారత్ వైపే చూస్తోందన అన్నారు. మోదీ స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించారని, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రాలకు రూ.3వేల కోట్లు కేటాయించినట్లు ప్రతాప్రూడీ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల శాతం ఎక్కువ అని వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 12 నైపుణ్య శిక్షణాకేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లన్నింటీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని కవిత వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







