రవ్వ కందిపప్పు ఉప్మా
- August 03, 2015
రవ్వ కందిపప్పు ఉప్మా
కావలిసిన పదార్దాలు
బియ్యం - ఒక కప్పు
కందిపప్పు - పావుకప్పు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
మినపప్పు - ఒక స్పూను
శెనగపప్పు -ఒక స్పూను
కొబ్బరి తురుము - ఒక స్పూను
కరివేపాకు - సరిపడా
ఉప్పు - సరిపడా
ఎండు మిర్చి - ఆరు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
బియ్యం, కందిపప్పు శుభ్రంగా కడిగి నీళ్లన్నీ వంపేసి సుమారు అరగంట పాటు పొడి బట్టమీద ఆరనివ్వాలి. ఆరిన తరువాత మిక్సీలో వేసి మరీ రవ్వలా కాకుండా, రెండు, మూడు సార్లు తిప్పి తీసేయాలి. ఒక బాణలిలో నూనె వేసి అందులో పోపు సామాన్లు అన్నీ వేసి వేగాక, కొబ్బరితురువౖుు కూడా వేసి వేయించాలి. తరువాత సుమారుగా రెండున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. మరిగినాక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్‌లోనికి తీసుకుని మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రవ్వ కందిపప్పు ఉప్మా రెడీ.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







