హల్దీతో హెల్దీ హెల్దీ
- August 03, 2015
పసుపును కేవలం పూజల కోసమే కాదు. ఔషధకారిగానూ, సౌందర్యలేపనంగా కూడా విరివిగా ఉపయోగిస్తారు. పూర్వం నుండీ పసుపు వాడకం అనేది సర్వ సాధారణంగా వస్తుంది. వంటల్లోనూ, స్త్రీలు వాడే సౌందర్యలేపనాల్లో మొదటి స్థానం పసుపుకే దక్కుతంది. పసుపుతో వేపాకు కలిపి మెత్తగా నూరి ఒంటికి పట్టించుకుంటే అనేక చర్మ సంబంధ వ్యాధులకు పూర్తి ఉపశమనం పొందవచ్చు. ముఖం మీద వచ్చే మొటిమలు, మచ్చలు మొదలగు వాటికి పసుపుతో కలిపి చేసే ఏ ఫేస్ ప్యాక్ అయినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పని చేసి అందాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అంతే కాదు వంటలో ఉపయోగించే చిటికెడు పసుపు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇన్ని రకాల యాంటి బయోటిక్ లక్షణాలు ఉన్న పసుపును ఇప్పుడు అనేక రకాల వైద్య పరిశోధనల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తాజా పసుపు కొమ్ములను ఉపయోగించి క్యాన్సర్ నిరోధక మందులను తయారు చేయడానికి వైద్య నిపుణులు పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







