కువైట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి రాజు క్షమాబిక్ష
- September 07, 2016
కువైట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరికి ఆ దేశ రాజు (అమిర్) షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా క్షమాభిక్ష ప్రకటించారు. బక్రీద్ పండుగ సందర్భంగా కొందరికి మిగిలిన శిక్ష కాలాన్ని మాఫీ చేయగా మరికొందరి శిక్షలను తగ్గించినట్లుగా కువైట్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. అయితే ఆ ఖైదీల జాతీయతను మాత్రం ప్రకటించలేదు. కాగా, ఇలాంటి సందర్భాలలో ఖైదీల వివరాలను గల్ఫ్ దేశాలు వెల్లడించవు. భారత నుంచి మాదక ద్రవ్యాలు రవాణా చేస్తూ పట్టుబడి కువైట్ జైళ్లలో మగ్గుతున్న వారిలో పలువురు అమాయకులు ఉన్నారు. వారిలో కొందరు ప్రవాసాంధ్రులు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని కువైట్లోని భారతీయ ఎంబసీతో పాటు కేంద్ర ప్రభుత్వం కువైట్ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. కువైట్ వచ్చిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ.కే.సింగ్ ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఆ వెంటనే కువైట్ అమిర్ ప్రకటన వెలువడడం గమనార్హం. కాగా, బుధవారం భారతీయ ఎంబసీలో మహత్మాగాంధీ విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి వి.కె.సింగ్ ప్రవాసీ ప్రతినిధులతో సమావేశమవుతారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







