జింజర్ +లెమన్ వాటర్ లో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి...

- September 11, 2016 , by Maagulf
జింజర్ +లెమన్ వాటర్ లో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి...

అల్లం ఔషధగుణాలున్న మూలిక. అల్లంలో ఉండే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇది బాగా పాపులర్ అయింది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ గ్యాస్ట్రిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో గ్రేట్ హోం రెమెడీ .ఈ మార్వలస్ రూట్ ప్లాట్ ఎక్సట్రార్డినరీ గుణాలుండటం వల్ల బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే క్రమంలో దీన్ని ఎక్కువగా .అల్లం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, థర్మో జెనిక్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. పవర్ ఫుల్ ఫ్యాట్ బర్నర్ గా పనిచేస్తుంది.అదేవిధంగా, నిమ్మరసంలో అద్భుత ఔషధ గుణాలున్నాయి. ఇవి కూడా ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. బరువు తగ్గించడంలో నిమ్మరసం కూడా గ్రేట్ హోం రెమెడీ.నిమ్మరసంలో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ గా మారి శరీరంలోని వేస్టేజ్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంలో ఫ్ల్యూయిడ్ రిటన్షన్ ను నివారిస్తుంది. శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. పొట్ట ఉదరంలో ఫ్యాట్ కరిగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది .అందువల్ల, జింజర్ అండ్ లెమన్ వాటర్ కాంబినేషన్ డ్రింక్ లో ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. అవేంటో ఒక సారి తెలుసుకుందాం .ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుందినిమ్మరసం మరియు జింజర్ వాటర్ లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందువల్ల, ఇది శ్వాస సమస్యలకు, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్, గొంతు బొంగురుపోవడం మరియు ఇతర అనారోగ్య సమస్యలకు వ్యతిరేఖంగా పోరాడి, రక్షణ కల్పిస్తుంది.

బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుందిజింజర్ మరియు లెమన్ వాటర్ కాంబినేషన్ డ్రింక్ లో ఉండే క్లెన్సింగ్ గుణాలు శరీరంలో అవాంఛిత వ్యర్థాలను , రక్తంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. అందువల్ల, బ్లడ్ ను శుద్ది చేయడంలో ఈ కాంబినేషన్ డ్రింక్ ఫర్ఫెక్ట్ అని చెప్పవచ్చు . ఈ కాంబినేషన్ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జింజర్ మరియు లెమన్ కాంబినేసన్ డ్రింక్ లో వివిధ రకాల బెనిఫిట్స్ ఉన్నాయి . ఇది అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది, . అజీర్తి, పొట్టలో ఫ్లూయిడ్ రిటెన్షన్ వంటి సమస్యలను నివారిస్తుంది. దాంతో జీర్ణ సమస్యలు నివారించబడి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

  చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది:
చర్మానికి నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందివ్వాలనుకుంటే , ఈ రెండు అద్భుతమైన పదార్థాలను మిక్స్ చేయాలి. నిమ్మరంలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ మరియు విటమిన్ సి అత్యధికం. అలాగే అల్లంలో కూడా ఆరోగ్యానికి సంబంధించి అమేజింగ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ ను తాగడం వల్ల చర్మానికి ప్రకాశవంతంగా, యూత్ ఫుల్ గా, మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
 బరువు తగ్గిచడంలో గ్రేట్ గా పనిచేస్తుంది

నిమ్మరసం, అల్లం కాంబినేషన్ లో తయారుచేసే డ్రింక్ తాగడం వల్ల శరీరంలో అనవసరపు క్యాలరీలను కరిగిస్తుంది. ఈ రెండు పదార్థాల్లో శరీరంలోని కొవ్వును కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బాడీ ఫ్యాట్ ను బర్న్ చేసి, అదనపు క్యాలరీలను కరిగించేస్తాయి. నేచురల్ గా బరువును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఇప్పుడు, జింజర్ మరియు నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను తెలుసుకున్నారు కదా? మరి ఈ కాంబినేషన్ డ్రింక్ ఎలా తయారుచేయాలి ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...
 
జింజర్ లెమన్ టీ తయారీ
ఒక కప్పు నీళ్ళను బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి, మూత పెట్టి 5 నిముషాలు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల న్యూట్రీషియన్స్ బాగా గ్రహించబడుతాయి. 5 నిముషాల తర్వాత కొద్దిగా నిమ్మరసంను మిక్స్ చేయాలి. అంతే జింజర్ లెమన్ టీ రెడీ. దీన్ని రోజూ ఉదయం పరగడపున తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.కొద్దిగా అల్లం ముక్కలు మరియు నిమ్మరసంను సలాడ్స్ మీద గార్నిష్ చేసుకోవచ్చు.కొద్దిగా అల్లంను సన్నగా తురుముకుని, దీన్ని లెమన్ జ్యూస్ లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సలాడ్స్ కు డ్రెస్సింగ్ గా చిలకరించి ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.
 లెమనేడ్ తయారీ
నిమ్మరసం, పంచదార కొద్దిగా అల్ల రసంతో లెమనేడ్ తయారుచేసుకోవచ్చు. ఈ లెమనేడ్ రిజివేట్ చేయడం మాత్రమే కాదు, బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com