సానియా మీర్జా డబుల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది..
- September 26, 2016
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబుల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబ్ల్యూటీఏ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 9730 పాయింట్లతో సానియా ప్రథమ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్ రెండో స్థానంలో నిలిచింది. వీరిద్దరి మధ్య కేవలం 5 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇటీవల చెక్ భామ స్ట్రికోవాతో జోడీ కట్టిన సానియా తాజాగా టోరో పాన్ పసిఫిక్ ఓపెన్‌ను గెలుచుకుంది. ఈ జోడీకి ఇది రెండో టైటిల్.భారత ఆటగాడు సాకేత్ మైనేని తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు చేరుకోగలిగాడు. సింగిల్స్ విభాగంలో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన మైనేని 138వ స్థానంలో నిలిచాడు.మరో ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ 229, యూకీ బాంబ్రీ 282వ స్థానంలో నిలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న 18వ స్థానంలో లియాండర్ పేస్ 60వ స్థానంలో కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







