గూగుల్.. 18వ పుట్టినరోజున దేశంలోని నెటిజన్లకు బహుమతి..
- September 27, 2016
ప్రముఖ సెర్చ్ ఇంజన దిగ్గజం గూగుల్.. తన 18వ పుట్టినరోజున దేశంలోని నెటిజన్లకు బహుమతి అందించింది. ముఖ్యంగా ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉండే ప్రాంతాల్లోని వినియోగదారులకు ఉపయోగపడేలా కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందించేందుకు 'గూగుల్ స్టేషన'ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. రైల్‌టెల్, భారత రైల్వే భాగస్వామ్యంతో దీనిని అందుబాటులోకి తీసుకొస్తోంది.అలాగే వివిధ రంగాలకు చెందిన వీడియోలన్నీ ఒకే చోట లభించే యూట్యూబ్‌కు అదనపు హంగులు అద్దింది. ఇక నుంచి యూట్యూబ్‌లో వీడియోలను ఆఫ్‌లైనలో ఇతరులకు పంపించుకోవచ్చు! ఇందుకోసం యూట్యూబ్ సరికొత్త వెర్షన.. 'యూట్యూబ్ గో' యాప్‌ను గూగుల్ విడుదల చేసింది.2జీ డేటా ఉపయోగించే వారు కూడా యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన విధానంలో అతి తక్కువ డేటా వినియోగంతో డౌనలోడ్ చేసుకునేందుకు యాప్‌ను ప్రవేశపెట్టింది. వీడియోలను ఆఫ్‌లైన విధానంలోనూ చేసేందుకు యూట్యూబ్ గతంలో మార్పులు చేసింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







