'ప్రతిక్షణం'. చిత్రం ఆడియో వేడుక ఘనంగా.......
- September 27, 2016
మనీష్, తేజస్విని నాయకానాయికలుగా నాగేంద్రప్రసాద్ (శ్రీనాగ్) దర్శకత్వంలో భాగ్యలక్ష్మి మూవీమేకర్స్ పతాకంపై జి.మల్లికార్జునరెడ్డి నిర్మించిన చిత్రం 'ప్రతిక్షణం'. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆడియో సీడీలను అతిథిగా విచ్చేసిన ఆర్.పి.పట్నాయక్ విడుదలచేసి, తొలి సీడీని అతిథిగా పాల్గొన్న శాసనసభ్యుడు గువ్వల బాలరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు బాలరాజు మాట్లాడుతూ, "చిత్రబృందానికి అంతటికీ అభినందనలు. వీరంతా సమష్టికృషితో చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి" అని ఆకాంక్షించారు. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, "ఈ చిత్ర సంగీత దర్శకుడు రఘురామ్ గాయకుడిగా ఉన్నప్పట్నుంచీ నాకు పరిచయం ఉంది.అతను చేసిన ఈ చిత్రం పాటలు చాలా బావున్నాయి. అలాగే ట్రైలర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో హీరోహీరోయిన్లకు మంచి బ్రేక్ దొరుకుతుందని భావిస్తున్నా" అని అన్నారు. హీరో మనీష్ మాట్లాడుతూ, "నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. చిత్రం మేమంతా అనుకున్నట్లుగానే చాలాబాగా వచ్చింది. పాటలన్నీ బావున్నాయని అందరూ అంటున్నారు" అని పేర్కొనగా, హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ, "నా కెరీర్‌లో చాలా మంచి చిత్రాన్ని అందించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. పాటలతో పాటు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుందన్న నమ్మకం ఉంది" అని అన్నారు.నిర్మాత మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ, "పారిశ్రామికవేత్తగా ఉన్న నేను తొలిసారిగా ఈ రంగంలోకి వచ్చేముందు ఎంతోమంది సన్నిహితులు వారించారు. అయితే దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి, ఈ చిత్రం చేశాను. హారర్ సినిమానే కానీ దెయ్యం ఉండదు. ప్రతిక్షణం ఆసక్తికరంగా ఉంటుంది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు. దర్శకుడు నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ, "కమర్షియల్ అంశాలుంటే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి ట్విస్ట్‌లుంటాయి. ప్రతీ సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. చిత్రబృందమంతా సహకరించడం వల్లే ఓ చక్కటి సినిమాను తీయగలిగాను" అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నవీన్‌యాదవ్, కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, మల్టీడైన్షన్ వాసు, సాయివెంకట్, రాజ్ కందుకూరి, మల్కాపురం శివకుమార్, మదన్, సురేష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







