చెడిన స్నేహం
- August 15, 2015
ఒక ఊరిలో లలిత, రాము అని ఇద్దరు స్నేహితులుండేవారు. వారిలో లలిత చాలా ధైర్యవంతురాలు. రాము కొంత పిరికివాడు. ఒక రోజు వీధిలోని పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు. వారితోపాటు వీళ్లిద్దరూ కూడా ఆడుకుంటున్నారు. అంతలో సోము అనే కుర్రవాడు అక్కడికి వచ్చి, మన ఊరి చివర బంగ్లా పక్కన ఉన్న పూలతోటలోంచి ఒక పువ్వు కోసుకుని తీసుకుని వస్తే వారికి నేను పది నెమలీకలు ఇస్తాను అని పందెం కాశాడు. నెమలీకలంటే రాముకి చాలా ఇష్టం. ఆ పోటీకి నేను సిద్ధమే అన్నాడు రాము. ఆ రోజు రాత్రి బంగ్లా దగ్గరికి బయలుదేరాడు రాము. ఈ సంగతి తెలిసిన లలిత అసలే చీకటి, పైగా అమావాస్య. రాముకి భయం ఎక్కువ అని ఒక టార్చిలైటు పట్టుకుని రాము వెంట బయలుదేరింది లలిత. దారిలో కాలికి ఏదో తగిలినట్లై బాబోయ్ అని అరిచాడు రాము. తన దగ్గరున్న టార్చిలైటును వేసి చూసింది లలిత. అది ఒక కుందేలు పిల్ల భయపడకు రాము అంది. చివరికి ఎలాగోలా బంగ్లా చేరుకుని అక్కడున్న తోటలోంచి లలిత సాయంతో ఒక పువ్వును కోసి, మనసులో భయపడుతూనే మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు రాము. తెల్లవారి సోము దగ్గరికి వెళ్లి పువ్వును చేతిలో పెట్టి, నెమలీకలు ఇమ్మన్నాడు. సోము నేను నీ ఒక్కడినే వెళ్లమంటే నువ్వు లలిత సాయంతో వెళ్లావు. కాబట్టి పందెంలో నువ్వు ఓడిపోయావన్నాడు. లేదు లేదు నేనొక్కడినే వెళ్లాను అని బొంకేశాడు రాము. అందుకు సోము రాత్రి నువ్వొక్కడివే వెళ్లావంటే ఇప్పుడు నువ్వు వెళ్లి లలితను కొట్టి రా అప్పుడు నమ్ముతాను నీ మాట అన్నాడు. అందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాము లలిత చెంప ఛెళ్లుమనిపించి వచ్చాడు. అప్పుడు కూడా సోము నెమలీకలు ఇవ్వలేదు. తుంటరి పందెం కట్టాడు సోము అని తెలుసుకున్న రాముకి నిజం తెలిసేసరికి లలితకి రాముపై కోపం వచ్చి అతనితో స్నేహం మానేసింది. అమాయకంగా ఉత్తుత్తి పందెం కట్టి మంచి స్నేహితురాలిని దూరం చేసుకున్నాడు రాము.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







