ఫలించిన ఉపాయం
- August 16, 2015
ఒక ఊరిలో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత పొలం, కొన్ని ఆవులు ఉండేవి. పొలంలో వచ్చే ఆదాయం కన్నా ఆవుల నుండి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల మరికొన్ని ఆవులని కొని వాటి పాలతో వ్యాపారం చేసేవాడు. పశువుల కొట్టంలో ఆవులు ఎక్కువయిపోవడం వల్ల తన దగ్గర ఎప్పట్నుంచో ఉంటున్న ఒక ఆవును కొట్టం బయట కట్టేవాడు. సుబ్బన్న దగ్గర ఒక కోడిపుంజు కూడా ఉండేది. ఆ కోడిపుంజు ప్రతిరోజూ మూడు కూతలు కూసి సుబ్బన్నతో పాటు ఇరుగు పొరుగువారందర్నీ కూడా లేపుతూ ఉండేది. సుబ్బన్న ఇంటి పక్కనే పుల్లమ్మ అనే ఒక పిసినిగొట్టామె ఉండేది. ఒకరోజు ఆమెకు ఓ పాడు బుద్ది పుట్టింది. కోడి కూతల్లో మూడో కూతకు లేచి సుబ్బన్న కొట్టం దగ్గరికి వచ్చి పాల పితికేవాడు. అందుకు పుల్లమ్మ మొదటి కూతకే నిద్ర లేచి సుబ్బన్న కంటే ముందే కొట్టం బయట కట్టేసిన ఆవుదగ్గరి పాలు పితుక్కుని చడీచప్పుడు లేకుండా ఎంచక్కా తన ఇంటిలోపలికి వెళ్లిపోయేది. రోజూ బయట ఉన్న ఆవు పాలు ఇచ్చేది కాదు సుబ్బన్నకు. ఇది గమనించిన సుబ్బన్న ఒకరోజు కోడి కూత కన్నా ముందే లేచి చాటుగా కొట్టం వైపు గమనించసాగాడు. కోడిపుంజు మొదటి కూతకే లేచిన పుల్లమ్మ పాలు పితుక్కుని పోవడం చూసి ఆమెకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. చాకలి వద్దకు పోయి ఒక గాడిదను తీసుకుని వచ్చి దానికి సుష్టిగా తినడానికి గడ్డి పెట్టి ఆవు ఉన్న ప్లేస్‌లో కట్టేసి వెళ్లి పడుకున్నాడు. యధావిధిగా పుల్లమ్మ లేచి హడావిడిగా కొట్టం వద్దకు వెళ్లి, అక్కడున్నది ఆవునా? గాడిదనా? అని కూడా గమనించకుండా తన పని మొదలుపెట్టింది. ఆవు స్థానంలో ఉన్న గాడిద గట్టిగా అరుస్తూ, ఒక్క తన్నుతన్నింది పుల్లమ్మని. బండారం బయటపడినందుకు సిగ్గుతో తలవంచుకుని తప్పు ఒప్పుకుంది పుల్లమ్మ.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







