పాక్‌లో ఆత్మాహుతి దాడి పంజాబ్ హోంమంత్రి సహా 9 మంది మృతి
- August 16, 2015
ఇస్లామాబాద్, పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో పంజాబ్ హోంమంత్రి సుజా ఖాన్జాదా సహా 9 మంది చనిపోయారు. అటోక్ జిల్లా షాదిఖియి గ్రామంలో సుజా నివాసంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. పేలుడులో పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడులో డిఎస్పీ షౌకత్ షా కూడా చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖాన్జాదా నివాసంలో సమావేశం జరుగుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య పెరిగింది. పాముకు పాలు పోసి పెంచినట్లు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిన పాకిస్థాన్ చివరకు పాము కాటుకే బలౌతోంది. అయినా పాక్ పాలకుల్లో మార్పు మాత్రం రావడం లేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







