జ్ఞాపక శక్తి పెరగాలంటే..
- August 17, 2015
మీరు మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక నుండి చెట్లు ఎక్కడం ప్రారంభించండి. ఎందుకంటే చెట్లెక్కితే జ్ఞాపకశక్తి పెరుగుతుందట! అందుకే గామోసు చెట్టులెక్కగలవా... ఓ నరహరి పుట్టలెక్కగలవా... అని పాట పాడుతూ ప్రియుడి తెలివితేటల్ని, సామర్ధ్యాన్ని ప్రియురాలు పరీక్షిస్తుంది ఓ పాటలో! చెట్లెక్కడం అనగానే అదేదో పిల్లల చేష్టలు అనుకునేరు! ఏ మాత్రం కాదు! పెద్దవయసు వాళ్ళు కూడా మెమరీ పవర్ పెంచుకోవాలనుకుంటే రోజూ చెట్లు ఎక్కుతూ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదని ఫ్లోరిడాలోని పరిశోధకులు వెల్లడించారు.
తెలివితేటల్ని పెంచుకోవాలంటే, క్రాస్ వర్డ్స్, సుడోకు పూర్తి చేయమని సాధారణంగా అంతా చెబుతారు. ఒకవేళ మీకు ఈ తతంగం బోర్ కొడితే చెట్లెక్కడం మొదలెట్టండి. తెలివితేటలు వాటంతట అవే పెరుగుతాయి! ప్రతి రోజు మనిషి తన దినచర్యకు సంబంధించి ఎన్నో విషయాలు మరిచిపోతూ ఉంటాడు. కానీ ఇలా చెట్లెక్కినవారిని పరిశీలించినప్పుడు వారిలో రోజువారీ జ్ఞాపకశక్తి యాభై శాతం మేరకు పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఫుట్‌బాల్, టెన్నిస్, స్క్వాష్ వంటి ఆటలు ఆడేవారిలో కూడా ఇదే స్థాయిలో రోజూవారీ పనులకు సంబంధించిన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







