మంచురియా దోశ
- August 17, 2015
దోశల పిండి - తగినంత
కాబేజీ - అర ముక్క
అల్లం తరుగు - ఒక చెమ్చా
వెల్లుల్లి తరుగు - అర చెమ్చా
పచ్చి మిర్చి తరుగు - పావు చెమ్చా చెమ్చా
సోయా సాస్ - అర చెమ్చా
అజినమోటో - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - దోసలకి తగినంత
తయారీ విధానం
దోసల పిండి తాజాగా ఉంటేనే ఈ దోసెలు బావుంటాయి. పుల్లటి పిండి బావుండదు. ముందుగా కాబేజీ ని సన్నగా తురుము కోవాలి . బాణలి లో చాలా కొద్దిగా (ఒక చెమ్చా ) నూనె వేసి ,వేడి కాగానే అల్లం వేసి వేయించాలి , కొంచం వేగగానే పచ్చి మిర్చి వేయాలి. అవి ఎర్రగా అవుతుండగా వెల్లులి వేసి అవి ఎక్కువ వేగకుండానే కాబేజీ వేసేయాలి. వెల్లుల్లి వేగితే రుచి మారుతుంది. అప్పుడే ఉప్పు కూడా వేసి బాగా కలిపి , మూత పెట్టకుండా వేయించాలి. మూత ఎందుకు పెట్టకూడదు అంటే
1. మూత పెడితే ఆవిరికి కాబేజీ లోకి తడి వస్తుంది. మనకి వేయించిన రుచి పోతుంది. కాబేజీ వేగాలి , ఉడుకితే రుచి వేరేగా వుంటుంది ..వేగితే రుచి వేరు .
కాబేజీ కొంచం వేగగానే సోయా సాస్, అజినమోటో వేసి కలపాలి. ఆ తర్వాత ఓ అయిదు నిముషాలు వేయించి దించేయాలి.
పెనం వేడి చేసి , దోస వేయాలి. దోస మీద కాబేజీ కూరని వేసి స్ప్రెడ్ చేయాలి దోస నిండా. దోస ని ఒక వైపే కాల్చాలి కాబట్టి పెద్ద మంట మీదే ఉంచాలి స్టవ్. అప్పుడే ఎర్రగా కాలుతుంది దోస.అలా ఒక వైపు కాల్చిన దోసని మధ్యకి మడిచి ప్లేట్ లో పెట్టి , పక్కన కొత్తిమీర చట్నీ వేసి మీ వాళ్ళకి పెట్టరను కోండి..మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు వాళ్ళు.
ఒకో రకం దోస కి ఒకో రకం చట్నీ కాంబినేషన్ ...ఈ దోసకి కొత్తిమీర బావుంటుంది. కొత్తిమీర చట్నీ అనగానే వేయించి , పోపు వేసి కాదు ..సింపుల్ గా చేసేయచ్చు .
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







