తడి ఆరని జ్ఞాపకం
- August 17, 2015
చిరకాల ఎదిరి చూపుల అనంతరం
కురిసే తొలకరి జల్లులకు పులకరించే
భూమి పుత్రుడుగా దిగుతాను నేను ..
సానుకూలంగా స్పందించి పచ్చగా విచ్చుకొని
ఆహ్వానించే ప్రకృతి కాంతలా, చేతులు చాచి నువ్వు ..
దూరానికి దూరానికి మధ్య జరిగే సమాగమమే
అయినా అదే మన తొలి సంగమం లా,
ఆ రసాస్వాదనా ..ఆనంద సాగరంలో మునిగి తేలి,
అటు తిరిగి నువ్వు ఇటు తిరిగి నేను మత్తుగా
గమ్మత్తుగా లతల్లా పెనవేసుకొని ఒకరికొకరం ...
యుగాల కదలికల్లో అడుగడుగునా కలిసిన భావనలో ....
నేను, క్షణికమైన ఆ మురిపెము మత్తుకు లాలసుడనై
అచేతనవస్తలోకి వెళ్లి పోయనేమోనని అనుకున్న,
నువ్వేమో....
కల లాంటి మన కలయిక, కదలకుండా ఉండదు కదా
అన్న నీ భయావహ యోచన లో.. పైకప్పు వైపు.. నిస్తేజంగా,
కేవలం ఓ పసుపు తాడుతో నిన్ను ఒంటరి 'బందీని'చేసి,
కటిన హృదయుడిగా వదిలి వెళ్ళిన మాట వాస్తవమే అయినా..
"పిచ్చి పిల్లా " నేను "వీధి" ఆడిన వింత నాటకంలో విదూషకుడనై
దిగువ మధ్య తరగతుల హెచ్చు తగ్గు లలో నలిగి పై కొమ్మకెగుర భంగపడి..
నేల విడచి సాము జేసి, ప్రవాసమనే వ్యసనంలో...
చిక్కుకు పోయిన అమాయకున్నే కానీ,
ఏ ప్రేమ భావం లేని ...శిల' నై
కేవలం కాముకున్నైన ఓ కొయ్యను మాత్రం కాను లే,
వేకువ జామున, అలుపెరుగని నీ నాజూకైన చేతి ముని వేళ్ళతో
నా పాదాలను తెలిసి తెలియకుండా.. తగిలి తగలనట్టు స్పృశించి,
నువ్వు వెళ్లి పోయాక.....
నేను తడిమి చూడలేదనుకున్నావా ?.. దిండుపై రాత్రి,
నీ కన్నులు వర్షించిన.. వేడి నీటి దారల తడిని...
నువ్వు భాద్యతల బరువుల్లో 'క్షమయా ధరిత్రి' వై, మరిచావేమో కానీ,
అది నా మదికిప్పడికీ ఎప్పటికీ ఒక తడి ఆరని జ్ఞాపకమే...!
(09-02-2014- తెలిసీ తెలియని తనంలో మన "కలయిక" 25 వసంతాల ఈ జ్ఞాపిక నీకు ...నాకు)
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







