పాలక్ పన్నీర్ ఫ్రాంకీ
- August 17, 2015
కావలిసిన పదార్ధాలు
పన్నీర్ - ఒక కప్పు
పాలకూర - ఒక కట్ట
జీలకర్ర పొడి - అరచెంచా
గోధుమ పిండి - కప్పు
వెన్న - అరకప్పు
నిమ్మరసం - అరచెంచా
పచ్చి మిర్చి - రెండు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
గోధుమ పిండిలో తగినంత ఉప్పు వేసి, నీళ్లతో కలిపి చపాతీ పిండిలా చేసి పెట్టుకోవాలి. తరువాత పన్నీర్‌ను, పాలక్‌ను సన్నగా తరిగి బాణలిలో కొద్దిగా నూనెగానీ, వెన్న గానీ వేసి పచ్చి వాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి. దానిలోనే తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలూ, జీలకర్రపొడి, నిమ్మరసం వేసి కలపాలి. చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకుని చపాతీలా ఒత్తుకుని, పెనం మీద వెన్న వేసి, సగం కాల్చి పెట్టుకోవాలి. దాని మధ్యలో పైన కలిపిన పనీర్ మిశ్రమాన్ని ఉంచి రోల్‌లా చేసి మళ్లీ పెనం మీద వెన్న వేసి బ్రౌన్ కలర్ వచ్చే దాకా ఫ్రై చేసి తీయాలి. ఇలా చేసిన రోల్స్‌ను టోమాటో సాస్‌తో కలిపి తింటే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







