కూరగాయలను ఎక్కువ రోజులు తాజా ఉంచే చిట్కాలు..
- October 15, 2016
ప్రస్తుతం మనం ఉన్న బిజీ జీవనశైలిలో రోజు రోజు కూరగాయలు కొనే సమయం కూడా లేనందువల్ల, వారానికి సరిపడా కూరగాయలు ఒకే సారి కొని ఫ్రిజ్ లో పెట్టి వాటిని వాడుతున్నాము. కానీ, ఇలా పెద్దమొత్తంలో కొన్న కూరగాయలను ఎక్కువ సమయం పాటూ తాజాగా ఉంచటం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. కానీ కొన్ని సులభ చిట్కాలను పాటించటం ద్వారా కూరగాయలు, పండ్లను ఎక్కువ కాలం పాటూ తాజాగా ఉంచుకోవచ్చు.
కూరగాయలు ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి చిట్కాలు
అన్నిటిని ఒకే స్థలంలో ఉంచకండి
చాలా రకాల ఆహార పదార్థాలు ఎథిలీన్ వాయువును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ వాయువు ఇతర కూరగాయాలను అకాల పక్వానికి గురి చేసి, సున్నితత్వాన్ని పెంచుతాయి. కావున ఫ్రిజ్ లో పెట్టె ఆహార పదార్థాలు ఎథిలీన్ ఉత్పత్తి చెందకూదనివి అయి ఉండాలి. ముఖ్యంగా టమోటాలను ఆకుపచ్చని కూరలతో లేదా క్యారెట్ లతో ఉంచకండి. ఎందకంటే టమోటాలో ఇతర ఆహార పదార్థాలను కూడా పక్వానికి గురి చేస్తాయి.
బెర్రీలను వేడి నీటితో కడగండి
బెర్రీలను ఫ్రిజ్ లో ఉంచినప్పటికీ బూజు పట్టడం ఎపుడైనా గమనించారా? అవును, ఒక రాత్రిలోనే బెర్రీలు ఇలా మారిపోవచ్చు. పెస్టిసైడ్ లను వాడి మాత్రమే ఈ రకం బాక్టీరియా సంక్రమణను నివారించటమే కాకుండా, వేడి నీటిలో వాటి కడగటం ద్వారా ఈ రకం సమస్యను తగ్గించవచ్చు. దీనినే 'థర్మోథెరపీ' అంటారు. బెర్రీలను వేడి నీటిలో కడగటం ద్వారా వాటి పై ఉండే బూజు సంబంధిత బీజాణువులను తొలగించవచ్చు. తరువాత శుభ్రమైన టవల్ తో తుడిచి ఫ్రిజ్ లో ఉంచటం వలన వీటిని ఎక్కువ సమయం వరకు
తాజాగా ఉంచుకోవచ్చు.
టిస్సు పేపర్ లో చుట్టూ ఉంచటం
ఆకుకురాలను కొన్న ఒకటి నుండి రెండు రోజులలో వాటిని తినలేకపోతే వాటి తాజాదనం కోల్పోవటమే కాకుండా వాటిలో ఉండే పోషకాలు కూడా తొలగిపోతాయిు. ఒకవేళ వీటిని రెండు రోజులలో పూర్తి చేయలేరు అనుకుంటే, వాటిని టిస్సు పేపర్ లో చుట్టూ ఉంచటం ద్వారా వాటిని తాజా ఉంచవచ్చు. ఇవి బూజు పట్టడానికి కారణమైన అదనపు తేమను ఈ పేపర్ గ్రహిస్తుంది. తరువాత వీటిని ఫ్రిజ్ లో ఉంచవచ్చు.
ఔషదాలు & కూరగాయలను ఐస్ వాటర్ తో కడగండి
పచ్చిని ఆకుకురాలను ఫ్రిజ్ లో ఎక్కువ సమయం పాటూ చల్లటి ఉష్ణోగ్రతల ఉంచటం వలన అవి వాటి తాజాదనాన్ని కోల్పోవచ్చు. కానీ, ఐస్ నీటిలో కడగటం ద్వారా వాటి తాజాదనాన్ని తిరిగి పునరుద్దపరచవచ్చు. కావున ఐస్ నీటితో నింపిన ఒక గిన్నెలో ఆకుకురాలను ఉంచండి. ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల పాటూ ఉంచటం ద్వారా వాటి తాజాదనం తిరిగి పొందవచ్చు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







