సూపర్ స్టార్ మహేష్ సినిమా టైటిల్ 'ఏజెంట్ శివ'
- October 15, 2016
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా వస్తున్న ఈ సినిమాకు రెండు చోట్ల ఒకే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఆ క్రమంలో మొన్నటిదాకా చాలా పేర్లు ప్రచారం జరిగాయి. కాని ఫైనల్ గా ఇప్పుడు 'ఏజెంట్ శివ' అనేది టైటిల్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది.
సినిమాలో ఐబి ఆఫీసర్ గా పనిచేసే మహేష్ క్యారక్టర్ పేరు శివ. అందుకే ఓ కేసు విషయంలో చిక్కుముడులన్ని విప్పి గెలిచే ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా మహేష్ కనిపించబోతున్నాడు. సినిమా టైటిల్ గా మొన్నటిదాకా అభిమన్యుడు అని ప్రచారం జరిగినా ఇప్పుడు ఏజెంట్ శివకే చిత్రయూనిట్ అంతా ఓకే చెప్పగా అదే ఫైనల్ అవుతుందని అంటున్నారు.ఇక టైటిల్ కన్ ఫ్యూజన్ కు తెర పడాలంటే మరో రెండు వారాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. తన బర్త్ డే కు, దసరాకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వని మహేష్ ఈసారి దీవాళికి ఓ పది సెకన్ల టీజర్ ను రిలీజ్ చేస్తున్నాడట. ఇక అదే క్రమంలో టైటిల్ కూడా కన్ఫాం చేస్తారట. మహేష్ ను మరికొంత స్టైలిష్ గా ఈ సినిమాలో చూపిస్తున్నారట మురుగదాస్.బ్రహ్మోత్సవం తర్వాత చేస్తున్న ఈ సినిమా పట్ల మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా పట్ల ఎలాంటి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ రాకుండా చూసుకుంటున్నాడు. ఇక మురుగదాస్ కూడా అకిరా ఫ్లాప్ తో ఈ సినిమాను మరింత కసిగా చేస్తున్నాడు. జనవరి కల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







