'నందిని నర్సింగ్ హోం' ఆడియో సక్సెస్ మీట్ ..
- October 15, 2016
నవీన్, శ్రావ్య, నిత్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నందిని నర్సింగ్ హోం'. ఎస్‌వీసి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దర్శకుడు పీవీ గిరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అచ్చు సంగీతాన్నందించిన 'నందిని నర్సింగ్ హోం' ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.నటుడు నరేష్ మాట్లాడుతూ.'ఎడిటర్ గా నవీన్ పేరుతెచ్చుకున్నాడు. ఈ సినిమాతో హీరోగానూ స్థిరపడాలని కోరుకుంటున్నాను. వినగానే నచ్చిన కథ ఇది. ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. అచ్చు సంగీతం 'నందిని నర్సింగ్ హోం'కు ఆకర్షణ అవుతుంది.' అన్నారు. హీరో నవీన్ మాట్లాడు తూ..'సంగీత దర్శకుడు అచ్చు నాకు ఏడేళ్లుగా తెలుసు. మంచి ప్రతిభ గల సంగీత దర్శకుడు. మా సినిమా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఆడియో సక్సెస్ అవడం మాకు సినిమాపై నమ్మకాన్ని పెంచింది. ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.' అన్నారు. షకలక శంకర్, సప్తగిరి, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి ఇతర నటించిన ఈ చిత్రానికి పాటలు : రెహమాన్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







