సినీ ఫక్కీలో ఉగ్రవాదులను హతమార్చిన కమాండోలు
- October 16, 2016
ఐఎస్ ఆధీనంలోని సిరియాలోని ఒక ప్రాంతంలోని పెద్దభవనం... భవనంలో కొందరు బాలికలు నిలువెల్లా భయంతో వణుకుతున్నారు... ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వారిని లైంగిక బానిసలుగా మార్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో... అమెరికా, బ్రిటన్ స్పెషల్ సర్వీసెస్‌కు చెందిన పలువురు కమాండోలు ఆ భవనంపై విరుచుకుపడ్డారు. కొందరు ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అనంతరం భవనంలోకి బ్రిటన్‌కుచెందిన కమాండో లోపలికి ప్రవేశించాడు. ఎదురుగా ఇద్దరు ఉగ్రవాదులు ఒకర్ని కాల్చివేశాడు. ఇంకో ఉగ్రవాదిని కాల్చివేసేందుకు తుపాకి ఎక్కుపెట్టాడు. అయితే తుపాకీ జామ్ అయింది. ఎదురుగా ఉగ్రవాది తుపాకితో అరుస్తూ మీదకి వచ్చాడు.
కమాండో ఏమాత్రం తొట్రుపడకుండా నడుముకి వున్న చిన్నగొడ్డలిని తీసి ఉగ్రవాదిని ఒకే దెబ్బతో హతమార్చాడు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోని ప్రాంతంలో జరిగింది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 12 మంది బాలికలకు విముక్తి కల్పించినట్టు అమెరికన్ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ కమాండో పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే ఆఫ్గన్, ఇరాక్‌లోని ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొన్న మాజీ కమాండో అని తెలిసింది. చిన్న చిన్న బాలికలను లైంగిక బానిసలుగా మార్చుతున్నారన్న వార్తలతో చలించిపోయిన అతను స్వచ్ఛందంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







