ఎమిరేట్స్ ఐడీతో దుబాయ్ ఇన్సూరెన్స్ కార్డుల రీప్లేస్‌మెంట్
- October 16, 2016
దుబాయ్: దుబాయ్ నివాసితులు తమ ఇన్స్యూరెన్స్ కార్డులను ఎమిరేట్స్ ఐడీ కార్డులతో రీప్లేస్ చేయబడ్తారు. 2017 తొలి క్వార్టర్ నాటికి ఇది జరిగే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్స్యూరెన్స్ కార్డుల్ని ఎమిరేట్స్ ఐడీ కార్డులతో లింకప్ చేయడానికి కొత్త డెడ్‌లైన్ విధించినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. 36 జిటెక్స్ టెక్నాలజీ వీక్ సందర్భంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. డిహెచ్‌ఏ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ డాక్టర్ మైదర్ అల్ యూసుఫ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 3.4 మిలియన్ రెసిడెంట్స్ ఇప్పటికే ఇన్స్యూరెన్స్ కవరేజీ పొంది ఉన్నారనీ, ఈ ఏడాది చివరినాటికి ప్రతి ఒక్కరూ ఇన్స్యూరెన్స్ కవరేజ్ పొందుతారని అల్ యూసుఫ్ చెప్పారు. సాదా హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కోసం (దుబాయ్‌లోని యూఏఈ జాతీయులకు) సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ని ఎమిరేట్స్ ఐడీ కార్డులతో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సాదా స్కీమ్‌లో 106,000 మంది ఇ్పటికే రిజిస్టర్ చేయించుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







