సింగపూర్ లోకల్ ట్రైన్లలో దీపావళి థీమ్...
- October 16, 2016
సింగపూర్ లాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సింగపూర్ లోకల్ ట్రైన్లలో దీపావళి థీమ్‌ను ప్రవేశ పెట్టారు. ట్రైన్ లోపలి భాగాల్లో హ్యాపీ దీపావళి అంటూ డెకరేషన్ చేశారు. రైల్వే స్టేషన్లలోనూ దీపావళి పండగను సూచించేలా కటౌట్లు, బ్యానర్లు, డిస్‌ప్లేలో ఉంచారు. హిందువులకు ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. అందుకే ఈ పండగకు ప్రాధాన్యం ఇస్తోంది సింగపూర్. గత కొన్నేళ్లుగా ముఖ్యమైన పండగలకు ఇలాంటి థీమ్స్‌ను సింగపూర్ లాండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అందుబాటులోకి తీసుకొస్తోంది. దీపావళి థీమ్ ముగిసిన తర్వాత క్రిస్‌మస్ పండగను పురస్కరించుకుని మరో థీమ్‌ను రైళ్లలో ప్రవేశ పెట్టనుంది. సింగపూర్ జనాభాలో 10 శాతం భారతీయులున్నారు. అక్కడ దీపావళి పండగను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. అందుకే ఈ పండగ సందర్భంగా సింగపూర్ సరికొత్త థీమ్‌ను రైళ్లలో ప్రదర్శిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







