మానవసహిత రోదసి యాత్ర : చైనా
- October 17, 2016
చైనా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ మానవసహిత అంతరిక్ష యాత్ర సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది. చైనా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇద్దరు వ్యోమగాములతో షెంజౌ-11 అనే వ్యోమనౌన రోదసిలోకి దూసుకెళ్లింది. జియుక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు.
ఈ నౌకలో జింగ్ హైపెంగ్.. షెన్ డాంగ్ అనే ఇద్దరు వ్యోమగాములు కక్ష్యలోకి పయనమయ్యారు. లాంగ్ మార్చ్ 2ఎఫ్ అనే రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌక నిర్ణీత క్షక్ష్యలోకి ప్రవేశించింది. రెండు రోజుల్లో వీరు రోదసిలోని చైనా ప్రయోగాత్మక అంతరిక్ష కేంద్రానికి చేరుకుని..నెల రోజులు అక్కడే బస చేస్తారు. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చేర్చిన తర్వాతి రోజు షెంజౌ-11 వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణం కానుంది. ప్రయోగానికి ముందు వ్యోమగాములు మీడియాతో మాట్లాడారు. ఈ మిషన్‌కు జింగ్ హైపెంగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.అంతరిక్షంలోకి వెళ్లడం జింగ్‌కు ఇది మూడోసారి. 2008లో షెంజౌ-7 మిషన్, 2012లో షెంజౌ-9 మిషన్‌లో జింగ్ రోదసిలో వెళ్లివచ్చారు. 2003లో చైనా తొలిసారిగా మానవసహిత అంతరిక్ష ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2022 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ఇప్పుడీ సుదీర్ఘ మానవసహిత రోదసి యాత్రను చేపట్టింది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







