జయచిత్ర కొడుకు అమ్రేష్ వివాహం
- October 17, 2016
ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర కొడుకు అమ్రేష్ వివాహం బుధవారం చెన్నైలో ఆడంబరంగా జరగనుంది. నాలుగు దశాబ్దాలకు పైగా నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా చిత్రరంగంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జయచిత్ర. తమిళం, తెలుగు భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన జయచిత్ర తన వారసుడు అమ్రేష్‌ను చిత్ర రంగానికి పరిచయం చేశారు. అమ్రేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయచిత్ర స్వీయ దర్శకత్వంలో నానే ఎన్నుళ్ ఇల్లై చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం అమ్రేష్‌కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా అమ్రేష్ సంగీతంపై మక్కువ చూపారు.దీంతో సంగీత దర్శకుడిగా మారి లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న మొట్టశివ కెట్టశివ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అమ్రేష్ ఇప్పుడు ఓ ఇంటి వాడు కాబోతున్నారు. డీ.సుదర్శన్, విజయశ్రీ దంపతుల కూమార్తెను పెళ్లాడబోతున్నాడు. బుధవారం ఉదయం వీరి వివాహ వేడుకకు ఎగ్మోర్‌లోని రాణి మెయమ్మైకల్యాణ మండపం వేదిక కానుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు గంగైలమరన్ సంగీత విభావరి ఆహూతులను అలరించనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







