'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫస్ట్‌లుక్ టీజర్ విడుదల..
- October 18, 2016
ని ఖిల్, హెబ్బాపటేల్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. పి.వెంకటేశ్వరరావు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్‌లో చిత్రబృందం ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కథానాయకుడు నిఖిల్ మాట్లాడుతూ ''ఇది ఫాంటసీ నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన ప్రేమకథ.
తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, సత్యలపై సాగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. వచ్చే నెల 11న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ''న్నారు దర్శకుడు చెబుతూ ''నా మిత్రుడు చెప్పిన ఓ సంఘటన ప్రేరణతో అల్లుకున్న ఈ ప్రేమకథని ఇంటిల్లిపాదీ చూసేలా థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాన''ని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ''ఆనంద్ చెప్పిన కథలోని కొత్తదనం ప్రేక్షకులకి నచ్చుతుందనే నమ్మకంతో నిర్మించాను. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సంగీతం ఈ చిత్రానికి అదనపు బలం''అని చెప్పారు. తమిళంలో నాలుగు చిత్రాలు చేశాననీ, తెలుగులో తొలి చిత్రమని నందిత శ్వేత చెప్పింది. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, మాటల సహకారం: విజయ్ కామిశెట్టి, ఛాయాగ్రహణం:సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్ చంద్ర, కూర్పు: ఛోటా కె.ప్రసాద్
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







