దుబాయ్ రోడ్లపై 'న్యూ రాడార్'
- October 18, 2016
దుబాయ్: దుబాయ్ పోలీసులు కొత్త రాడార్ని షోకేస్ చేశారు. హార్డ్ షోల్డర్ డ్రైవింగ్కి పాల్పడేవారిని ఈ న్యూ రాడార్ కనిపెడుతుంది. జిటెక్స్ టెక్నాలజీ వీక్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు దుబాయ్ పోలీసులు. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, ఈ కొత్త రాడార్ ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలు, వాహనదారులకు సంబంధించి క్వాలిటీతో కూడిన ఫొటోల్ని తీసే అవకాశం ఉందని తెలిపారు. ట్రయల్ ఫేజ్లో ఈ కొత్త రాడార్లు అద్భుతంగా పనిచేసినట్లు ట్రాఫిక్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలి కరమ్ చెప్పారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఫ్లాష్ లేకుండానే హై రిజల్యూషన్ ఫొటోల్ని రిమోట్ కంట్రోల్ పద్ధతిలో చిత్రీకరించడానికి ఈ కొత్త రాడార్లు ఉపయోగపడ్తాయి. ఈ రాడార్లను రోడ్డు పక్కనే ట్రైపాడ్ మరియు బ్యాటరీ సహాయంతో తాత్కాలికంగానూ, ఫిక్స్డ్పొజిషన్లో ఎలక్ట్రానిక్ సోర్స్ లేదా సోలార్ పవర్ ద్వారా ఉపయోగించుకునే వీలుంది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







