ఆమె స్పెషల్ లేడీ అంటున్న బిగ్ బి
- October 18, 2016
అలనాటి బాలీవుడ్ నటి స్మితా పాటిల్ 'స్పెషల్ లేడీ' అంటూ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు. స్మితా 61వ జయంతి సందర్భంగా అమితాబ్ ఆమెను స్మరించుకున్నారు.
స్మితాతో కలసి శక్తి, నమక్ హలల్ సినిమాల్లో నటించానని అమితాబ్ పేర్కొన్నారు. స్మితా స్పెషల్ లేడీ, వివేకవంతమైన స్నేహితురాలు.. అంటూ ట్వీట్ చేశారు. 1980ల్లో స్మితా అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. కేవలం దశాబ్దకాలం కెరీర్లో 80కి పైగా సినిమాల్లో నటించారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో నటించారు. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు పద్మశ్రీ అందుకున్నారు. మంతన్, భూమిక, ఆక్రోశ్, చక్ర, చిదంబరం, మిర్చ్ మసాలా వంటి హిట్ సినిమాల్లో నటించారు.
బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్చర్ ను వివాహం చేసుకున్న స్మితా 31వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆమె కుమారుడు ప్రతీక్ నటుడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







