సుమంత్ కథానాయకుడుగా కొత్త చిత్రం 'నరుడా డోనరుడా'
- October 18, 2016
సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం 'నరుడా డోనరుడా'. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రాల్స్, ఎస్. ఎస్. క్రియేషన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'నరుడా డోనరుడా సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌కు చాలా కొత్తగా ఉంటుంది. నాగార్జున విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మహేశ్‌బాబు విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, సుమన్ శెట్టి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెలలో నిర్వహించాలనుకుంటున్నాం. అలాగే సినిమాను నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







