క్యాష్ డిపాజిట్ మెషీన్లలో పనిచేయని కొత్త కరెన్సీ
- October 18, 2016
మనామా: కొత్త 10, 20 బహ్రెయినీ దినార్స్ కరెన్సీ నోట్లు క్యాష్ డిపాజిట్ మెషీన్లలో పనిచేయడంలేదు. దాంతో బహ్రెయినీ బ్యాంకులు రంగంలోకి దిగి, పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సమస్యల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని బ్యాంకులు వెల్లడిస్తున్నాయి. కొత్త నోట్లకు సంబంధించ ఈ సమస్య తలెత్తిందనీ, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్యాష్ డిపాజిట్ మెషీన్లలో సమస్యలున్న దరిమిలా, బ్యాంకు శాఖల్ని వినియోగించుకోవాల్సిందిగా వినియోగదారుల్ని బ్యాంకులు కోరుతున్నాయి. ఈ సమస్య గురించి వినియోగదారులకు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారం అందిస్తున్నట్లు బ్యాంకుల అధికారులు చెప్పారు. మరిన్ని భద్రతా ఫీచర్యలతో కొత్త కరెన్సీ నోట్లను ఇటీవలే బహ్రెయిన్‌లో విడుదల చేయడం జరిగింది. కొత్త నోట్లు విడుదలైనప్పటికీ పాత నోట్లు ఇంకొన్నాళ్ళు చెల్లుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







