జుట్టు పెరిగేందుకు సహజసిధ్ధ చిట్కాలు
- October 18, 2016
కొన్ని దశాభ్ధాలకు పూర్వం ఒత్తైన, పొడవైన వెంట్రుకలతో మన పూర్వీకులు ఉండేవారు. వృధ్ధాప్యంలోనూ వారి కేశ సంపద తరిగేది కాదు. రాను..రానూ.. మారుతూ వస్తున్న జనరేషన్ ఆహార అలవాట్లు, వంశపారంపర్యత, వాతావరణ మార్పులు, కాలుష్యం వీటన్నిటి వల్ల కేశ సంపద నష్టానికి గురవుతూ వస్తోంది. దానికి కారణం ఆ రోజుల్లో రసాయనాల వాడకం ఈ రోజుల్ల ఉండేది కాదు. అన్నీ సహజసిధ్ధమైనవే వాడేవారు. అలాగే రోడ్లపై కాలుష్యం అంతే తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే ఈ రోజు ప్రతివారూ జుట్టు ఒత్తుదనం తగ్గుతోందని, రాలిపోతోందనే సమస్యని చెబుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం వినియోగిస్తున్న కృత్రిమమైన షాంపూలు, క్రీములు, హెయిర్ డ్రైలు. హెయిర్ స్టైలింగ్ లో భాగంగా వాడే ఇనుపవస్తువులు,డ్రైయర్లు వంటి వాటి వల్ల ఒత్తుదనం తగ్గిపోతోంది. కానీ ఈ రోజుల్లో కొన్ని సహజసిధ్ధమైన చిట్కాలు ఉపయోగించటం వల్ల ఈ సమస్య నుంచీ బయటపడవచ్చు.
జుట్టు అందాన్ని ఇనుమడించటంలో ప్రధానమైన అంశం. అది ఆడవారికైనా మగవారికైనా సరే. అందమైన ఒత్తైన జుట్టు మీలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. జుట్టు తరుగుదల మీలో స్ట్రెస్ ని పెంచుతుంది. మార్కెట్లో ఈ రోజు చాలా ప్రోడక్ట్లు జుట్టు రాలకుండా ఉండేందుకు ఉన్నాయి. అయితే జుట్టు ఒత్తుదనం పెరిగేందుకు కొన్ని సహజసిధ్ధమైన చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం..
ఆయిల్ మస్సాజ్
మీ స్కాల్ప్ ని రోజూ మస్సాజ్ చేసుకోండి. మస్సాజ్ వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టును కాపాడుతుంది. మీ స్కాల్ప్ ని వేడి నూనె తో మస్సాజ్ చేసుకోవాలి. ఈ మస్సాజ్ సర్క్యులర్ పొజిషన్లో చేసుకోవాలి. జొజొబా, కొబ్బరినూనె తో ఈ మస్సాజ్ చేసుకుంటే మంచిది. అదే చుండ్రు తగ్గాలంటే రోజ్ మేరి ఆయిల్ తో చేసుకోవాలి. కొన్ని నిముషాలు మస్సాజ్ చేసుకుని వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత వెచ్చటి టవల్ తో తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవాలి.
సరైన ఆహారం
జుట్టు రాలటాని తగ్గించుకోవాలంటే మంచి మార్గం మంచి ఆహారం. మీరు మంచి ఆహార అలవాట్లను అలవరచుకుంటే మంచిది. ఉదాహరణకి విటమిన్- సి, విటమిన్-బి, కాపర్, జింక్ మొదలైనవి తీసుకోవటం మంచిది. వీటిలో ఉన్న పోషకాలు, పౌష్టికాలు మీ కేశసంపదను వృధ్ధి చేస్తాయి.ఇంకో మంచి టిప్ ఏంటంటే మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇది హైడ్రేషన్ అంటే శరీరం లోని వేడిని దూరం చేస్తుంది.
కండీషనింగ్
మంచి కండీషనర్ ను వాడటం మంచిది. ఇది మీ కేశాలకు బలాన్నిస్తుంది. అంతేకాక దీనిని తలస్నానం షాంపూతో చేశాక చేయాలి. మరొక విషయమేమంటే దీనిని స్కాల్ప్ కి దూరంగా పెట్టుకోవాలి. 1-2 అంగుళాలు స్కాల్ప్ కి దూరంగా పెట్టుకోవాలి. ఇది జుట్టుని మృదువుగా, నాజూకుగా ఉంచుతుంది.
అలోవేరా
అలోవేరా ప్రతి ఇంట్లో ఉండే మొక్క. ఇది సహజసిధ్ధమైన ఔషధం. ఇది కేశాలపై బాగా పని చేస్తుంది. దీనిలో ఉన్న పోషకాలు మీ స్కాల్ప్ ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. దీనిని స్కాల్ప్ కి రాసుకుని గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కేశాలు నిగారింపుగా, కాంతివంతంగా ఉంటాయి.
రసాయనాలకు దూరంగా
రసాయనాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని ప్రాడక్ట్లు హెయిర్ స్ట్రైకెనింగ్ కి, కలరింగ్ కి ఉన్నాయి.
కోడిగ్రుడ్డు
మీకు మీ కేశసంపద పెంచుకోవాలంటే ఈ టిప్ ను అనుసరించండి. ఒక గ్రుడ్డును మీ హెయిర్ కి మాస్క్ గా వేసుకోండి. తెల్లసొన తీసుకుని అలాగే పచ్చసొన కలిపి జుట్టుకి పెట్టుకోవాలి. తర్వాత 10 నిముషాల తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా తక్కువగా షాంపూ వేసుకుని చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది.
మెంతులు
ఇవి ప్రతీ వంటింట్లో ఉండేవే. మెంతుల్ని తీసుకుని ముందు రోజు రాత్రి నీటిలో నాన పెట్టుకోవాలి. తర్వాతి రోజు ఉదయానే వాటిని గ్రైండ్ చేసుకుని తలకు పెట్టుకోవాలి. గంట తర్వాత నీటితో కడుగుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితముంటుంది.
బంగాళదుంప జ్యూస్
బంగాళాదుంపలో విటమిన్-ఎ,బి, సి, ఉంటాయి.ఇవి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. బంగాళాదుంప జ్యూస్ ను తలకు పట్టించి 15 నిముషాలు ఉంచి కడుగుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.
ఆమ్ల
ఆమ్ల అనేది సహజసిధ్ధ ఔషధం. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. దీన్ని చాలా హెయిర్ ప్రాడక్టుల్లో వాడుతారు. ఇది ఆనతికాలంలోనే జుట్టు మళ్ళీ పెరిగేలా చేస్తుంది.
హైబిస్కస్ ఫ్లవర్
ఇది జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. వృధ్ధప్యం చాయల్ని దూరం చేస్తుంది. ఒత్తుదనం పెంచుతుంది. దీనితో పాటు కొబ్బరి నూనె కలుపుకుని వాడితే చాలా మంచిది.
హెన్నా
గోరింటాకుతో కూడిన హెన్న చాలా మంచిది. సహజసిధ్ధ ఔషధం గా కూడా పేర్కొనవచ్చు. ఇది కేశాల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తుంది. హెన్నాను ఒక ఇనుప బౌల్ లో రాత్రంతా నానపెట్టుకోవాలి. పొద్దున్నే తలకు పట్టించాలి. గంట తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. జుట్టు బలంగా తయారవ్తుంది.
స్ట్రెస్ కు దూరంగా
స్ట్రెస్ జుట్టు ఊడటానికి ప్రధాన కారణం. స్ట్రెస్ తగ్గించుకుంటే జుట్టు ఊడకుండా బాగుంటుంది. ఇందుకు రోజూ వ్యాయామం, యోగా లాంటివి చేస్తే మంచిది. స్ట్రెస్ తగ్గుతుంది.
జుట్టు పెరిగేందుకు సహజసిధ్ధ చిట్కాలు
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ జుట్టుకు రాసుకుంటే వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. దీనిని తలకు రాసి మస్సాజ్ చేసుకుని 3 నిముషాల పాటు వదిలేసి షాంపూతో వాష్ చేసుకోవాలి.
కాస్పర్ ఆయిల్
ఇది చాలా జిగురుగా ఉండే ఆయిల్. చాలామంది దీనినే వాడి జుట్టు పెరుగుదల చాలా సులభమని అంటున్నారు. అయితే దీనిలో ఫ్యాటీ కంటెంట్ అయిన విటమిన్- ఇ ఉంటుంది. ఇది జుట్టు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. దీనిని స్కాల్ప్ కి పట్టించిన తర్వాత మస్సాజ్ చేసుకోవాలి.
అవకాడో
ఇది ఒక ఫల చేట్టు. ఇది చాలా మందికి ఈ దేశంలో ఇష్టమైన ఫలం. దీనిలో విటమిన్-ఇ ఉండి అది జుట్టు ఒత్తుదనం, పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీనిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని దానికి గుజ్జు అరటిని కలిపి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి 30 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.
షాంపూ జాగ్రత్త
షాంపూలు వాడేప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎటువంటి షాంపూలు వాడితే మంచిదో నిపుణుల సలహా మేరకే వాడాలి. మంచివి కానివి వాడితే హెయిర్ రూట్స్ పాడవుతాయి.
ఉల్లి జ్యూస్
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదన్న సామెతలా ఉల్లి చాలా వాటికి ఔషధం. దీనిలో సల్ఫర్ ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. అంతేకాక సరైన విధ్ధంగా వెంట్రుకలు పెరుగుతాయి.15 నిముషాల పాటు తలకు ఈ జ్యూస్ ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









