చిన్నతనం నుంచే కార్లపై ఆసక్తి....
- October 19, 2016
పందొమ్మిదేళ్ల ప్రేమ్ ఠాకూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో అనుభవం బొత్తిగా లేదు. కార్ల తయారీ గురించి అతనికి ఎవరూ దిశానిర్దేశం చేయలేదు. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక స్థోమత కూడా లేదు. కానీ సొంతంగా ఒక బగ్గీకారుని తయారుచేసి.. అందరిచేత ఔరా అనిపించుకున్నాడు.
నవీ ముంబయికి చెందిన ప్రేమ్ ఠాకూర్(19) ప్రస్తుతం బీ.కాం చదువుతున్నాడు. ఇతనికి చిన్నతనం నుంచే కార్లపై ఆసక్తి. అందులోనూస్పోర్ట్స్ కార్లంటే మరీను. ఆ ఆసక్తే ఇప్పుడతనికి కార్లను తయారు చేసే ఆలోచనను కలిగించింది. దానికి తగ్గట్టే ప్రస్తుతం ఒక బగ్గీకారును తయారుచేశాడు.
పాత సామాన్లతో ఆ కారుని తయారుచేసి స్వయంగా దానికి రంగులు అద్దాడు. దానిని నడుపుతూ వీధుల్లో, పెట్రోలు బంకుల్లో వెళ్తుంటే అందరూ దానిని చూడటానికి ఎగబడుతున్నారు. అంతేనా ఫోన్లతో ఫొటోలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే దానిని ఒక సామాన్యుడు తయారుచేయడమే.నిజానికి అతనికి ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో ఎలాంటి అనుభవమూ లేదు. 12వ యేటనే తన తండ్రి కంప్యూటర్ కొనిచ్చాడు. అప్పట్నుంచీ అంతర్జాలంలో కార్ల గురించే ఎక్కువ కాలక్షేపం చేసేవాడు.యూట్యూబ్‌లో కార్ల తయారీ వీడియోలనే చూసేవాడు. వాస్తవానికి అతని తండ్రి రిక్షా పుల్లర్. రోజుకు నాలుగైదు వందలు సంపాదించడమే గగనం. దాంతోనే కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కొడుకు ఆసక్తికి అడ్డు చెప్పలేదు. ఉన్నంతలో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ప్రేమ్. దానికి మొత్తం రెండున్నల లక్షల వరకు ఖర్చయింది.'ఈ రోజు బగ్గీకారు తయారుచేశానంటే దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి అంతర్జాలంలో కారు తయారు గురించి నేర్చుకోవటం, రెండు మా బామ్మ సహా ఇంట్లో వాళ్లందరూ నాకు సహకరించటం. భవిష్యత్తులో మరింత ఎక్కువ కృషి చేసి వినూత్నమైన కార్లను సృష్టించాలన్నది నా లక్ష్యం. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో గుర్తింపు సంపాదిస్తా' అని అంటున్నాడు ప్రేమ్ ఠాకూర్.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







