భారత్ భారీ క్షిపణుల తయారుచేస్తోంది..
- October 19, 2016
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా రక్షణ రంగంలో భారత్, రష్యా కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు కలిసి ప్రమాదకరమైన క్షిపణులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ పై దాడిచేయడానికి అవసరమైన 600 కిలోమీటర్ల ప్లస్ రేంజ్ లోని తర్వాతి తరం బ్రహ్మోస్ భారీ క్షిపణిలను రష్యా సహకారంతో భారత్ సిద్ధం చేస్తోంది. న్యూఢిల్లీ, మాస్కో ఇరు నగరాలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. కచ్చితమైన టార్గెట్ లో ఈ క్షిపణులు దాడులు చేయనున్నాయి. పాకిస్తాన్ లో ఏ ప్రాంతంలోనైనా దాడిచేసే శక్తి ప్రస్తుతం తయారుచేసే క్షిపణులకు ఉంటుంది. ఈ ఏడాది జూన్ లో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో న్యూఢిల్లీ భాగమైంది.
ఎంటీసీఆర్ లో భాగమైన తర్వాత రష్యా, భారత్ లు సంయుక్తంగా తయారుచేసే అతిపెద్ధ బ్రహ్మోస్ క్షిపణిని ఇదే, భారత్ కూ ఇదే మొదటి అత్యంత ముఖ్యమైన ప్రయోజనం.
పర్వత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావారాలను ధ్వంసం చేయగలిగే శక్తి బ్రహ్మోస్ కు ఉంటుంది. ప్రస్తుతం రూపొందుతున్న బ్రహ్మోస్ క్షిపణులన్నీ 300కిలోమీటర్ల రేంజ్ లోనివే. పాకిస్తాన్ లోపలికి చొచ్చుకునిపోయి లక్షిత దాడులు చేయడానికి ఇవి కొంచెం కష్టతరంగా మారుతున్నాయి. దీంతో తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణుల తయారీకిను భారత్ పూనుకుంది. తర్వాతి తరం బ్రహ్మోస్ తో పోలిస్తే ఎక్కువ రేంజ్ లోని బాలిస్టిక్ క్షిపణులను భారత్ ఇప్పటికే కలిగిఉంది. కానీ బ్రహ్మోస్ మాత్రమే నిర్ధేశిత లక్ష్యాలను విజయవంతంగా కూల్చేయగలవు. గోవాలో జరిగిన ద్వైపాక్షిక సమిట్ లో భారత్, రష్యాలకు రక్షణ ఒప్పందాలపై కీలకమైన ఒప్పందాలు జరిగినట్టు తెలిసింది.
ఈ ఒప్పందాల్లో భాగంగా ఇరు దేశాలు క్షిపణుల భారీ డీల్స్ నే కుదుర్చుకున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణులను మరింత అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. ఐదో తరం ఎయిర్ క్రాప్ట్ ల తయారీకి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ప్రకంపనాలతో ఆ దేశానికి భారత్ గట్టి షాకే ఇస్తోంది. ఉగ్రవాదాన్ని ఏరివేసే క్రమంలో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినా తాము సిద్ధమేనంటూ సిగ్నల్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భారత్ భారీ క్షిపణుల తయారుచేస్తోంది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







