దుబాయ్ రిటైల్ స్టోర్స్‌లో ఎన్‌ఓఎల్ చెల్లింపులు
- October 19, 2016
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఎన్‌ఓఎల్ కార్డుల వినియోగాన్ని విస్తరించుకుంటూ వెళుతోంది. నెట్వర్క్ రిటైల్ స్టోర్స్‌లో ఎన్‌ఓఎల్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చునని ఆర్టిఎ పేర్కొంది. మెట్రో, ట్రామ్ మరియు బస్‌ల కోసం ఎన్‌ఓఎల్ కార్డుల్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే తాజాగా దుబాయ్ పబ్లిక్ పార్క్‌లు, ట్యాక్సీలకు కూడా వీటిని విస్తరించారు. పార్కింగ్ కోసం కూడా ఎన్‌ఓఎల్ కార్డుల్ని వినియోగించుకునే వెసులుబాటుని కల్పించడం జరిగింది. 5,000 దిర్హామ్‌లకు పైన చెల్లింపులు చేయాలనుకునేవారికి ఎన్‌ఓఎల్ ద్వారా జూమ్ కన్వీనెన్స్ స్టోర్లలో (మెట్రో మరియు పెట్రోల్ స్టేషన్లలో) చెల్లించవచ్చు. జూమ్ స్టోర్స్‌తోపాటు త్వరలో 1000కి పైగా రిటైల్ స్టోర్స్‌లో కూడా ఎన్‌ఓఎల్ కార్డులు వినియోగించుకునేందుకు వీలుగా వెసులుబాటు కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లోనే కాకుండా, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు చేయడం ద్వారా వినియోగదారులకు భద్రతతో కూడిన చెల్లింపుల కోసం ఈ సేవల్ని విస్తరించినట్లు వారు చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







