హైదరాబాద్‌లో 'సింగం-3' షూటింగ్ పూర్తి
- October 20, 2016
ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'సింగం-3'. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు విజయాలు సాధించాయి. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తమిళ్లో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ఈ చిత్రానికి రెండు భాషల్లో క్రేజ్ వుంది. అందరి అంచనాలను అందుకుంటుందని నమ్మకం వుంది. సూర్య సరసన అనుష్క, శతి హాసన్ నాయికలుగా నటిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్ నేటితో పూర్తయ్యింది. దీంతో టాకీ పార్ట్ పూర్తయ్యింది. మిగిలి వున్న ఒక పాటను సూర్య, అనుష్క పై విదేశాల్లో త్వరలో చిత్రీకరిస్తూ షూటింగ్ పూర్తవుతుంది. దీపావళికి టీజర్, నవంబర్‌లో ఆడియోని విడుదల చేసి డిసెంబర్ 16న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్‌లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో పూర్తి చేసుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లతో బిజినెస్ పూర్తయిందని అన్నారు. ఇంకా రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







