నందిని నర్సింగ్ హోం రివ్యూ
- October 20, 2016
నటి విజయ నిర్మల మనవడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా నందిని నర్సింగ్ హోం శుక్రవారం రిలీజైంది. పి.వి.గిరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ కామెడీగా సాగింది. అక్కడక్కడ దెయ్యం మార్కు సీన్స్ కూడా ఉన్నా నవీన్ విజయ కృష్ణ నటనతో అవి తమాషాగా సాగాయి. కథలోకి వెళ్తే.. మధ్యతరగతి కుర్రాడైన చంద్రశేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ కృష్ణ) వైజాగ్ లోని ఓ బ్యాంకులో రికవరీ మన్ గా పని చేస్తుంటాడు. ఆ బ్యాంకు పక్కనే గర్ల్స్ హాస్టల్.. ఇంకేం.. ఆ హాస్టల్ నుంచి వచ్చే స్వీట్ వాయిస్ కి ఐసై పోతుంటాడు. ఆ హాస్టల్ లోని అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయిదే ఆ గొంతు అని తెలుసుకుంటాడు. పరిచయాలు ఏర్పడతాయి.అయితే ఇద్దరి దృక్పథాలు వేరు. డబ్బే ముఖ్యం అన్నది అమూల్య ఫిలాసఫీ అయితే డబ్బు కన్నా బంధాలు, బాంధవ్యాలు గొప్పవి అని చందు నమ్ముతుంటాడు.ఏమైతేనేం.. ఇద్దరూ ప్రేమలో పడతారు. డబ్బుకే విలువనిచ్చే అమూల్య తండ్రి ఫోన్ చేసి ఏడాదికి 18 లక్షలు సంపాదించే కుర్రాడి సంబంధం వచ్చిందని చెబుతాడు. దీనిపై అమూల్యఎలాంటి నిర్ణయం తీసుకుంది..? తన లవరే కావాలనుకుందా లేక తండ్రి చూసిన కుర్రాడే కావాలనుకుందా అన్నది సస్పెన్స్. ఇక నందిని నర్సింగ్ హోం అన్నది టర్నింగ్ పాయింట్. ఈ నర్సింగ్ హోం లో చందు డాక్టర్ గా చేరడం, అక్కడ అతనికి వింతయిన ఘటనలు ఎదురుకావడం కాస్త హారర్ కామెడీని తలపిస్తుంది. ఆ హోం అధినేత కూతురు నందిని చందును ప్రేమిస్తుంది. అసలు బ్యాంకు రికవరీ ఏజెంట్ అయిన చందు డాక్టర్ ఎలా అయ్యాడు..? నర్సింగ్ హోం మిస్టరీ ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేజాతకాల పిచ్చోడిగా జయప్రకాష్ రెడ్డి నవ్విస్తే. షకలక శంకర్, వెన్నెల కిషోర్ మరింత కడుపుబ్బా నవ్విస్తారు.. నవీన్ విజయ క్రిష్ణకిది ప్రాక్టికల్ గా రెండో చిత్రమే అయినా రిలీజైన మొదటి సినిమా. అతని నటన ఓకె. హీరోయిన్లు కూడా మంచి మార్కులే కొట్టేశారు. సప్తగిరి కామెడీ వెరైటీగా ఉంది. రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా సాగింది నందిని నర్సింగ్ హోం. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే..రీ-రికార్డింగ్ అంతగా నప్పలేదు. నవీన్ యాక్షన్ తో పోలిస్తే హీరోయిన్లు మరింత రాణించాల్సి ఉంది. మొత్తం మీద గిరి డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఓ మంచి కామెడీ చిత్రాన్ని అందించాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







