లింగమార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న 37 మంది ఆసియా ప్రవాసీయులు
- October 21, 2016
కువైట్ సిటీ : స్థానిక మఃబౌల ప్రాంతంలో ఒక నకిలీ దేశీయ కార్మిక కార్యాలయం నిర్వహిస్తూ, కువైట్ పౌరులు మోసగిస్తున్న 37 మంది ఆసియా దేశస్థుల సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు అక్కడ కొనసాగిస్తున్నఅక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందుకొని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక జట్టు వీరిపై పరిశోధనలు కోసం ఏర్పాటు చేయబడింది. వారిని పెట్టుకొనేందుకు ఒక ఉచ్చు ఏర్పాటు చేయబడింది. అనుమానితులను అరెస్టు చేసి అవసరమైన చట్టబద్ధమైన చర్యల కోసం సంబంధిత అధికారులు సూచించారు.ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన ప్రవాసీయ వ్యక్తులు చట్టవిరుద్ధంగా కొందరకి లింగమార్పిడి శాస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీలు అక్రమంగా చేస్తున్నందుకు వారిని అరెస్టు చేశారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటనల గురించి సమాచారాన్ని పొందిన తర్వాత వారి కదలికలపై సమగ్ర పరిశోధనలను జరిపి వారిని అరెస్ట్ చేశారు వారికి ఎటువంటి అర్హత కల్గిన వైద్య సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ వారు పలు శస్త్రచికిత్సలు ఎన్నో జరిపారు. ఈ తరహా లింగమార్పిడి శస్త్రచికిత్సలు ఎన్నో చేసినట్లు వారు తమ తప్పుని ఒప్పుకున్నారు. దీనితో అవసరమైన చర్యల కోసం సంబంధిత అధికారులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







