పశ్చిమ జపాన్లో భూకంపం...
- October 21, 2016
పశ్చిమ జపాన్లో భూకంపం సంభవించింది. జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. టోక్యోకి పశ్చిమాన 700కి.మీ. అవతల ఉన్న టొట్టోరిలో 10 కి.మీ. లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్ర అధికారులు తెలిపారు. అయితే దీని వల్ల సునామీ సంభవించే ప్రమాదం ఏమీ లేదన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు గుర్తించలేదని, కానీ భూకంపం వల్ల విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దాదాపు 40వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.తరచూ భూకంపాలు సంభవించే జపాన్లో గతంలో అధిక తీవత్రతోసంభవించిన భూకంపాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







