చిన్నారులకు సుపారి అమ్మకం: సూపర్ మార్కెట్ మూసివేత
- October 22, 2016
ఉమ్ అల్ కువైన్ మునిసిపాలిటీ, ఓ సూపర్ మార్కెట్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ విద్యార్థులకు సుపారీ (చవకైన టొబాకో) అమ్మకాలు జరిపినందుకుగాను చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్షన్, సూపర్ మార్కెట్‌లో జరుగుతున్న అనైతిక చర్యలపై సమాచారం అందుకోగానే, అప్రమత్తమయ్యింది. ఇన్‌స్పెక్టర్స్ టీమ్, సూపర్ మార్కెట్‌లో తనిఖీలను నిర్వహించి, రెడ్ హ్యాండెడ్‌గా నిర్వాహకుల్ని పట్టుకున్నారు. సుపారీగా పిలవబడే పొగాకు ఉత్పత్తుల్ని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్స్ గురించారు. ల్యాబ్ టెస్టుల్లో, సుపారీ పసిపిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తేలింది. గుర్తించలేని ఓ పదార్థంతో టొబాకోని మిక్స్ చేసి విక్రమిస్తున్నారు సూపర్ మార్కెట్ నిర్వాహకులు. నిబంధనలకు అనుగుణంగా ఆ సూపర్ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







