దుబాయ్‌లో కీ హోల్‌ సర్జరీ లైవ్‌ వర్క్‌ షాప్‌

- October 22, 2016 , by Maagulf
దుబాయ్‌లో కీ హోల్‌ సర్జరీ లైవ్‌ వర్క్‌ షాప్‌

డాక్టర్‌ ఆర్‌.పద్మకూమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మిసికాన్‌ మాట్లాడుతూ, లాప్రోస్కోపీ సర్జరీ అనేది వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ విధానంలో రోగులు చాలా తక్కువ సమయంలో కోలుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. తక్కువ కోతతోనే సర్జరీలు పూర్తవడం వల్ల కాంప్లికేషన్స్‌ తగ్గుతాయని వివరించారాయన. సన్‌రైజ్‌ హాస్పిటల్‌ గ్రూప్‌ డాక్టర్లు, తమ పేటెంటెడ్‌ కీ హోల్‌ టెక్నిక్స్‌ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. 25 విధాలైన సర్జరీల గురించి తెలిపారు. కోచి నుంచి ఈ లైవ్‌ వర్క్‌ షాప్‌లో పాల్గొన్న ఇంటర్నేషనల్‌ మోడర్న్‌ హాస్పిటల్‌ అబ్‌స్టెట్రిషియన్‌ మరియు గైనకాలజీస్ట్‌ డాక్టర్‌ అల్పీ ఎస్‌ పుతిదోమ్‌ మాట్లాడుతూ, తమ తరఫున మూడు విధాలైన కీహోల్‌ టెక్నిక్స్‌ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించినట్లు తెలిపారు. సర్వైకల్‌ కెర్‌క్లేజ్‌, ఎండోమిమెట్రిక్టమీ, లాప్రోస్కోపిక్‌ హిస్టరెక్టమీ వంటి విధానాలు ఇందులో ముఖ్యమైనవి. వెయ్యి మందికి పైగా అంతర్జాతీయ డాక్టర్లు రెండ్రోజుల లైవ్‌ సర్జరీ వర్క్‌ షాప్‌లో పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com