దహీ బెండీ మసాలా
- October 27, 2016
కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు: నాలుగు కప్పులు, ఉల్లిపాయ: పెద్దది(ముక్కలుగా చేసుకోవాలి), టమోటాలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), పసుపు: చిటికెడు, అల్లం వెల్లుల్లి ముద్ద: స్పూను, పెరుగు: కప్పు, కొబ్బరి తురుము: స్పూను, మెంతిఆకులు: ఒకటిన్నర స్పూను, గరం మసాలా పొడి: టేబుల్ స్పూను, మామిడికాయ పొడి: ఒకటిన్నర స్పూను, నూనె: తగినంత, ఉప్పు: రుచికి సరిపడ, కారం: తగినంత, జీడిపప్పు: పది, ఆవాలు. జీలకర్ర, మినపప్పు: తలా ఓ స్పూను, ఎండు మిరపకాయలు: రెండు లేదా మూడు, ఇంగువ: చిటికెడు, కరివేపాకు: కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా జీడిపప్పును కొద్దిసేపు నానబెట్టి అనంతరం కొబ్డరిపొడితో కలిపి కొద్దిగా పాలు పోసుకుంటూ మెత్తగా ముద్దగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసుకొని బెండకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా వేయించి తీసి పక్కన పేపరు మీద పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి మరికొద్ది సేపు వేయించాలి. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వుడికిన తరువాత కారం, ఉప్పు, గరంమసాలా, మామిడికాయ పొడి, మెంతి ఆకులు అన్నీ వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు ముద్ద వేసుకోవాలి. అనంతరం పెరుగును గిలక్కొట్టి వేయాలి. ఇవన్నీ ఉడుకుతున్న సమ యంలో బెండకాయ ముక్కలు వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించి కిందకి దింపేయాలి. బెండకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.
తాజా వార్తలు
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!







