మూడు నిమిషాల్లో వరుసగా 122 సెల్ఫీలు దిగి వాల్‌బర్గ్ కు గిన్నిస్ రికార్డు...
- October 28, 2016
యువతలో సెల్ఫీలకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. సమయం సందర్భం అనేది లేకుండా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు సరదా కోసం లెక్కలేనన్ని సెల్ఫీలు తీసుకుంటుంటారు. అయితే అమెరికాకు చెందిన డాన్నీ వాల్‌బర్గ్ సెల్ఫీలతో కూడాగిన్నిస్‌రికార్డు సాధించాడు. అమెరికాకు చెందిన డాన్నీ వాల్‌బర్గ్ గాయకుడు. అతనికి సెల్ఫీలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చితోనే గిన్నిస్ రికార్డును సాధించాలనుకున్నాడు. అందుకే మెక్సికోలోని కోజుమెల్‌లో సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు దీనికి శ్రీకారం చుట్టాడు. అతనితో పాటు నౌకలో ప్రయాణిస్తున్న వారు వరుసలో నిలబడి అతనితో సెల్ఫీలు తీసుకున్నారు.కేవలం మూడు నిమిషాల్లో వరుసగా 122 సెల్ఫీలు దిగి వాల్‌బర్గ్ గిన్నిస్ రికార్డును సొంత చేసుకున్నాడు. అయితే ఇంతకు ముందు కూడా వాల్‌బర్గ్ గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించినప్పటికీ అది విజయవంతం కాలేదు. అయితే పట్టువదలకుండా ప్రయత్నించి గత సెప్టెంబరులో సింగపూర్‌కు చెందిన అరుబా సృష్టించిన 119 సెల్ఫీల రికార్డును ఇప్పుడు తిరగరాశాడు. ఈ రికార్డు ఛేదన సమయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు న్యాయనిర్ణేత సారా కాసన్ అక్కడే ఉండి అతని ఘనతను నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రం కూడా అందజేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







