విమానం లో యువతిని వేధించి.. దొరికిన బిజినెస్‌మేన్..
- October 28, 2016
విమానం సీటులో నిద్రిస్తున్న ఓ యువతిని అసభ్యరీతిలో తాకి విచిత్రంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయాడు ఎన్నారై బిజినెస్‌మేన్. వ్యాపారవేత్తని దోషిగా తేలడంతో 20 వారాల జైలుశిక్ష విధించింది న్యాయస్థానం. అసలేం జరిగిందంటే.. ఇండియాలో పుట్టి, కతార్‌లో వుంటున్నాడు 46 ఏళ్ల బిజినెస్‌మేన్ సుమన్ దాస్. జూలైలో బ్రిటన్‌లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో ఆయన అరెస్టయ్యాడు. 18 ఏళ్ల బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. విమానంలో ఏం చేస్తున్నాడో అతడికి తెలుసని, తాను మేలుకువలో ఉన్నానో లేదా తెలుసు కోవడానికి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు తెలిపింది.పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని, అత్యంత సాన్నిహిత్యంగా ఆమెను తాకడం ద్వారా బాధితురాలకి వేదన మిగిల్చావని న్యాయమూర్తి తెలిపారు. కమ్యూనిటీ సర్వీస్‌లాంటి తేలికైన శిక్ష జోలికి వెళ్లకుండా 20 వారాల జైలుశిక్షను విధించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







