రాజేశ్వరరావుకు జానకి పెద్ద అభిమాని...
- October 28, 2016
చిన్నతనంలో వేదికలపై సాలూరి రాజేశ్వరరావు పాటలు అనేకం పాడుతూ పెరిగానని ప్రముఖ గాయని జానకి తెలిపారు. శుక్రవారం తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు 95వ జయంత్యుత్సవం సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన స్మారక పురస్కారాన్ని ప్రముఖ సంగీత గేయకవి వి.బి.సాయికృష్ణ యాచేంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాన కి సాయికృష్ణ యాచేంద్రను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్వరరావు సినిమా పాటలే కాకుండా ప్రైవేటు పాటలు రాసి ప్రేక్షకులకు చేరువయ్యారని అన్నారు. రాజేశ్వరరావుకు పెద్ద అభిమానినని తెలిపారు.పగలే వెన్నె లా.. అనే పాట తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో మరిచిపోలేరని అలాంటి పాట తాను పాడడంతో అదృష్టమని అన్నారు. సభాధ్యక్షత వహించిన డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ అస్తవ్యస్త వ్యవస్థలో మనసు గాయమైనపుడు రాజేశ్వరరావు పాటలు వింటే హాయిగా ఉంటుందని అన్నారు. లలిత సంగీతానికి పరిమళం అద్ది సినిమాలకు అందించిన ఘనత ఆయనదని అన్నారు.కార్యక్రమం లో పి.విజయబాబు, సంగీత దర్శకుడు కోటి, సాలూరి వాసురావు, రోషన్ సాలూరి ఎం.కె.రాము, ఆశాలత తదితరులు పాల్గొని సాయికృష్ణయాచేంద్రను సత్కరించారు. అంతకుముందు రాజేశ్వరరావు స్వరపరిచన చిత్రాల్లోని పాటలను ఆలపించారు. పలు మధురమైన గీతాలతో ప్రేక్షకులను అలరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







