సింధు ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో ఓటమి ..
- October 29, 2016
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో ఓటమి పాలైంది. కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ అందుకోవాలన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి.
ఫామ్‌లోకి పీవీ సింధు: ఫ్రెంచ్ ఓపెన్‌పై గురిప్రెంచ్ ఓపెన్ సిరిస్‌లో భాగంగా తొలి రౌండ్లో విజయం సాధించిన సింధు చైనా క్రీడాకారిణి హి బింగ్జియో చేతిలో 22-20, 21-17 తేడాతో పరాజయం పాలైంది. దీంతో పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. సింధు వరుసగా రెండు టోర్నీల్లో రెండో రౌండ్లోనే వెనుదిరగడం అభిమానులను నిరాశ పరచింది.ఇదిలా ఉంటే పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రణయ్‌కి కూడా రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన ఐదో సీడ్ ఆటగాడు చెన్ చౌ చేతిలో 19-21 16-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. స్విస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ప్రణయ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.కాగా, రియో ఒలింపిక్స్‌లో ఆడిన తర్వాత తొలిసారి డెన్మార్క్ ఓపెన్‌లో ఆడిన ఆమె రెండో రౌండ్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







