రివ్యూ : చల్ చల్ గుర్రం.
- October 29, 2016
సినిమా రివ్యూ : చల్ చల్ గుర్రం
నటీనటులు : శైలేంద్ర, దీక్షా పంథ్, అంగనా రాయ్..
సంగీతం : వెంగి
దర్శకత్వం : మోహన ప్రసాద్
నిర్మాత : ఎం. రాఘవయ్య
'ముకుందా' సినిమాతో తెరగ్రేటం చేసిన శైలేంద్ర పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా 'చల్ చల్ గుర్రం'. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం
కథ : మనోహర్ (శైలేంద్ర) స్టాప్ వేర్ ఉద్యోగి. అనుకోకుండా అతడికి ఏదో కష్టం వస్తుంది. ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి చాలా డబ్బు అవసరం కావడంతో రెండు చోట్ల డే అండ్ నైట్ షిప్ట్ లలో పనిచేస్తుంటాడు. మరి అనుకున్న విదంగా డబ్బు సంపాదించాడా..? ఆ ప్రమాదం ఏమిటీ..? ఈ కథలో షీలా (దీక్షా పంథ్), రతి (అంగనా రాయ్) ఎవరూ?
అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బలాలు..బలహీనతలు :
హీరో శైలేంద్ర నటన ఫర్వాలేదనిపించింది. హీరోయిన్లు ఇద్దరికీ నటించడానికి పెద్దగా అవకాశాలేం లేకపోయినా అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సినిమా మొత్తంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఒక్కటే బాగుంది. బలమైన కథ లేకపోవడమే ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్. డబ్బు సంపాదించడం కోసం ఒకేసారి రెండు కంపనీల్లో ఉద్యోగం చేయడమన్న ఆలోచనను రెండు గంటల పాటు సాగదీసి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించారు. పాటలు కూడా వినసొంపుగా లేవు. కామెడీ ట్రాక్స్ ఏవీ ఆకట్టుకోకపోగా సినిమాను మరింత డీలా చేశాయి. సాంకేతిక అంశాల పరంగా చూస్తే.ముందుగా దర్శకుడు మోహన ప్రసాద్ ఎక్కడా మెప్పించలేకపోయాడు. ఎడిటింగ్ బాగోలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
చివరగా : థియేటర్ నుంచి చలో..చలో..
రేటింగ్ః 1/5
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







