మిల మిల మెరిసే పళ్ళకోసం
- August 24, 2015
కాఫీ, టీలు ఒలికి తెలుపు రంగు బట్టల మీద పడితే మరకలు ఎలాగయితే పడతాయో అచ్చం అలాగే తెల్లటి దంతాలపై కూడా మరకలు పడతాయి. కాలక్రమంలో ఆ మరకలే తెల్లగా మెరిసిపోయే దంతాలను పసుపు రంగులోకి మార్చేస్తాయి. రంగురంగుల ఆహారపదార్ధాలు, ఆమ్ల గుణం కలిగిన పదార్థాలు దంతాల తెల్లదనానికి ప్రధాన శత్రువులు. అలాగని వాటిని తినకుండా ఉండలేరు. ఏ పదార్థాల వల్ల అలా జరుగుతుందో తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
- తిన్న వెంటనే నోట్లో నీళ్లుపోసుకుని పుక్కిలించేయాలి. ఎక్కువమంది ఏదైనా తిన్న తరువాత పళ్లను బ్రష్‌తో రుద్దేస్తుంటారు. ఈ అలవాటు దంతాలకు హాని కలిగిస్తుంది. అందుకని తిన్న గంట తరువాతే దంతాల మీద బ్రష్ ఆడించాలి. ఏ పానీయమైనా స్ర్టాతో తాగాలి. ఈ అలవాటు దంతాల మీద పడే చెడు ప్రభావాన్ని చాలా వరకు తగ్గించేస్తుంది.
- బ్లాక్ టీలో టానిన్స్ అధికంగా ఉంటాయి. టీకి రంగునిచ్చే వీటివల్లే దంతాల రంగు మారిపోతుంది. అందుకే బ్లాక్‌టీ బదులు గ్రీన్‌టీ తాగాలి. అంతేకాకుండా వేడివేడి టీ తాగడం కూడా హాని కలిగిస్తుంది.
- బ్లాక్ కాఫీ రంగులో ముదురుగా ఉండడమే కాకుండా ఆమ్లాల మోతాదు కూడా ఎక్కువగానే కలిగి ఉంటుంది. ఈ కారణం చేతనే బ్లాక్‌కాఫీ దంతాల రంగును త్వరితంగా మార్చేస్తుంది.
- శీతల పానీయాల్లో వాడే కృత్రిమ రంగులు దంతాల రంగును పూర్తిగా మార్చేస్తాయి. అంతేకాకుండా వీటిలోని సిట్రిక్ ఆమ్లం పంటి ఎనామిల్ మీద ప్రభావం చూపుతుంది. ఈ పానీయాల్లో ఉండే చక్కెర వల్ల దంతాలు పుచ్చిపోయే అవకాశమూ ఉంది.
- పసుపు, కారాలు వంటకాలకి రంగునిచ్చేందుకు వాడతారు. అవి వంటకాలతో పాటు దంతాల రంగును కూడా మార్చేస్తాయి. రెస్టారెంట్లలోని ఆహార పదార్థాల్లో వీటిని ఎక్కువ మోతాదులో వాడతారు. సో బీకేర్‌ఫుల్.
- బీట్‌రూట్‌లో కలర్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే బీట్‌రూట్ జ్యూస్‌లో చూస్తే వీటి గాఢత మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకని జ్యూస్‌కి బదులు బీట్‌రూట్‌ని తినడమే బెటర్.
- గుండె ఆరోగ్యానికి రెడ్ వైన్ మంచిది(తక్కువ మోతాదులో). ఆ ఆరోగ్యం సంగతి పక్కన పెడితే ఇందులో ఉండే టానిన్స్ దంతాల రంగును మార్చేస్తాయి. అయితే వైట్‌వైన్ తాగేయొచ్చు అంటున్నారా ఇందులో కలర్ కాంపౌండ్స్ ఉండవు కాని ఆమ్లాలు మెండుగా ఉంటాయి.
- స్వీట్స్, క్యాండీ, చూయింగ్ గమ్‌ల తయారీలో కృత్రిమ రంగులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగులు దంతాల ఎనామిల్ మీద ప్రభావం చూపుతాయి. అందుకని రంగులు లేని, షుగర్ ఫ్రీ గమ్‌లను తినడం బెటర్. అసలు తినకపోతే ఇంకా మంచిది.
- ద్రాక్ష, క్రాన్‌బెర్రీ వంటి పళ్ల రసాలు దంతాలు, నాలుక మీద రంగును అద్దడం గమనించే ఉంటారు. ఇలాకాకుండా ఉండాలంటే పళ్ల రసాలకి బదులుగా పళ్లని నేరుగా తినాలి.
- చైనీస్ వంటకాల్లో రంగు కోసం వాడే సోయాసాస్ ప్రభావం దంతాల మీద ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







